పిల్లలకు ఏం కావాలి?
‘మీ పిల్లలు మీ పిల్లలే కారు.. అనంత స్వీయార్థమైన జీవితాభిలాషకు వారు కొడుకులు, కూతుళ్లు. వాళ్లు మీ ద్వారా వచ్చి మీతోనే ఉంటున్నా, మీకు చెందిన వారు మాత్రమే కారు. మీ ప్రేమను వారికి ఇవ్వగలరేమో కానీ, మీ ఆలోచనలను ఏ మాత్రం ఇవ్వలేరు. వారికీ ఉన్నాయి స్వీయ ఆలోచనలు..’ అంటాడు ఖలీల్ జిబ్రాన్.
‘మీ పిల్లలు మీ పిల్లలే కారు.. అనంత స్వీయార్థమైన జీవితాభిలాషకు వారు కొడుకులు, కూతుళ్లు. వాళ్లు మీ ద్వారా వచ్చి మీతోనే ఉంటున్నా, మీకు చెందిన వారు మాత్రమే కారు. మీ ప్రేమను వారికి ఇవ్వగలరేమో కానీ, మీ ఆలోచనలను ఏ మాత్రం ఇవ్వలేరు. వారికీ ఉన్నాయి స్వీయ ఆలోచనలు..’ అంటాడు ఖలీల్ జిబ్రాన్.
నిజంగా మరి పిల్లలకేం కావాలి, పిల్లలేం కావాలి? వారు మన నుంచి ఏం ఆశిస్తున్నారు? సంరక్షకులుగా మనం వారికి ఏమివ్వాలి? ఎలాంటి వాతావరణం, ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి? ఏ విధమైన శిక్షణాపరమైన మానసిక సంసిద్ధతను మనం తల్లిదండ్రులుగా కల్పించాలి? ఇటువంటి సంక్లిష్టమైన సంఘర్షణాత్మకమైన సంశయాలకు సమాధానం ఎవరు ఇస్తారు? ‘మనిషి సంఘజీవి’ అంటాడు తత్వవేత్త అరిస్టాటిల్. సంఘం నుంచి మనిషిని వేరుచేసి చూడలేం.
ఒకవేళ మనిషిని సంఘం నుంచి లేదా సమూహం నుంచి వేరు చేస్తే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? అతని ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా మానసిక శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాల ద్వారా నిరూపించారు. కుటుం బం నుంచి మనిషిని వేరుగా ఊహించలేం. అందుకే ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త జె.బి.వాట్సన్ ఇలా అంటాడు. ‘నాకు డజన్ మంది పిల్లలను ఇవ్వండి. నేను వారిని మీరు కోరినవిధంగా తీర్చిదిద్ది ఇవ్వగలను’ అని. ఏమి తెలియని, ఎలాంటి ముద్రలు పడని పసి మనసుల్లో ఎలాంటి శిక్షణవైపు వారిని మనం సన్నద్ధులను చేస్తామో అలాంటి వారే తయారవుతారు.
మనిషి జీవితంలో అత్యంత కీలకపాత్ర పోషించే దశ బాల్యం. ఈ దశలో పడే సానుకూల దృక్పథా లే పిల్లల మానసికస్థితిని నిర్ణయిస్తాయి. ఒకప్పుడు సామూహిక జీవన విధానం ఉండేది. ఇప్పుడు వ్యష్ఠి జీవితానికి అలవాటుపడి సామూహిక జీవ నం నుంచి ఒంటరితనం వైపు ప్రయాణిస్తున్నారు. అందుకే నేడు మైనర్లు కూడా పబ్బుల్లో, క్లబ్బుల్లో, రేవ్ పార్టీల్లో కనిపిస్తున్నారు. డ్రగ్స్ బాధితులుగానో, హింసాత్మక ఘటనల్లో నిందితులుగానో మిగులుతున్నారు.
లోపం ఎక్కడుంది? ఎవరిని దీనికి బాధ్యులను చేయాలి? తల్లిదండ్రులనా, పిల్లలతో కలిసి తిరిగే సమవయస్కులనా, లేదా విద్యా సంస్థలనా? పిల్లల శారీరక మానసిక పెరుగుదల, వికాసాన్ని, మార్పు లను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉం డాలి. సరైన మార్గదర్శనం చేస్తూ ఉండాలి. బాలిక అయితే తల్లి, బాలుడైతే తండ్రి చొర వ తీసుకొని వారిలో అసహజమైన ప్రవర్తన కనిపిస్తే వాటివల్ల కలిగే పరిణామాలు, ఫలితాలను వివరించి చెప్పాలి. గమనించాల్సిన విషయమేమంటే.. ఏమి తెలియని పసి మనసులలో ఎలాంటి ముద్రలను మనం వేస్తామో వాటినే పెద్దగైన తర్వాత అనుసరించే అవకాశం ఉన్నది. మారుతున్న జీవనసరళి, ఆకర్షిస్తున్న పాశ్చాత్య సంస్కృతి, కొడిగడుతున్న మానవ విలువలు, పలుచబడుతున్న సంబంధ బాంధవ్యాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పర్యవసానాలు సమాజంపై పడుతున్నవి.
ఇక్కడ మరో ఇద్దరు ప్రఖ్యాత వ్యక్తుల గురించి ప్రస్తావించాలి. ఒకరు ఫ్రెంచ్ తత్వవేత్త రూసో. మరొకరు జెఫ్ బెజోష్ రూసో. బాల్యంలోనే తల్లిని కోల్పోవడం తండ్రి మద్యం సేవించి చిన్న పిల్లవాడైన రూసో చేత బూతు పుస్తకాలు చదివిస్తూ ఆనందించేవాడు. అలాంటి పరిస్థితుల మధ్య పెరిగి పెద్దవాడై అతను చేసిన రచనలు (సోషల్ కాంటాక్ట్, ది ఎమిలి) ఫ్రెంచ్ విప్లవానికి పరోక్ష కారణాలుగా నిలిచాయని చరిత్ర చెప్పిన సత్యం. ఇక జెఫ్ బెజోష్ ఇతని తల్లి (జాక్లిన్) యవ్వనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించడం గర్భం దాల్చడం అతను మోసం చేయడం ఆత్మహత్యకు పూనుకొని విరమించుకోవడం అనంతరం జెఫ్ బెజోష్ జన్మించడం. నేడు అమెరికాలోని సంపన్నుల్లో బెజోష్ ఒకడు. హిట్లర్ అయినా, కసబ్ అయినా, రూసో అయినా, బెజోష్ అయినా వారి కుటుంబ నేపథ్యాలలోంచే వారు అలా తయారై సమాజంపై, ప్రపంచంపై ప్రభావం వేశారు.
పిల్లలకు ప్రణాళికాబద్ధంగా సలహాలు, సూచనలు సరైన మార్గదర్శకత్వం, పర్వవేక్షణతో, వారి ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా తల్లిదండ్రులు కూడా నడుచుకుంటే ఉత్తములైన వ్యక్తులుగా ఎదుగుతారు. అందుకే పాఠశాల స్థాయిలోనే మానసిక నిపుణుల ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఏర్పాటుచేయాలి. ప్రతి పాఠశాల, కళాశాల స్థాయిలో కనీసం నెల కు ఒకసారి చట్టాల పట్ల, వాటిని ఉల్లంఘిస్తే వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో వివరించి చెప్పాలి. తద్వారా తమ వ్యక్తిత్వాన్ని, నడవడికను తీర్చిదిద్దుకుంటారు. అందుకే.. పిల్లలు మీ పిల్లలే కానీ, వారికి ఆశలుంటాయి. పిల్లలకేం కావాలో గమనిద్దాం. వారి ఆశలు, ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుందాం. మంచి సమాజాన్ని నిర్మిద్దాం.
(వ్యాసకర్త: వ్యక్తిత్వ వికాస నిపుణులు)
-డాక్టర్ మహ్మద్ హసన్
99080 59234
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

