నవ్విపోదురుగాక!
తూలిపడినా, జారిపడినా లేవడానికి ఆసరా కోసం ఏ చెయ్యో, కాలో, తాడో, కొమ్మో పట్టుకోవడం సహజం. కానీ ఈ సూత్రం తమకు వర్తించదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొత్త భాష్యం చెప్తున్నారు. తాను పైకి లేవడానికి ఇవేవి కాకుండా కాలర్ పట్టుకున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి ప్రకటించారు. రాహుల్‌గాంధీపై ఈడీ కేసులకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఆందోళన సందర్భంగా రేణుకాచౌదరి పంజాగుట్ట ఎస్ఐ కాలర్ పట్టుకున్న విషయం
తూలిపడినా, జారిపడినా లేవడానికి ఆసరా కోసం ఏ చెయ్యో, కాలో, తాడో, కొమ్మో పట్టుకోవడం సహజం. కానీ ఈ సూత్రం తమకు వర్తించదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొత్త భాష్యం చెప్తున్నారు. తాను పైకి లేవడానికి ఇవేవి కాకుండా కాలర్ పట్టుకున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి ప్రకటించారు. రాహుల్‌గాంధీపై ఈడీ కేసులకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఆందోళన సందర్భంగా రేణుకాచౌదరి పంజాగుట్ట ఎస్ఐ కాలర్ పట్టుకున్న విషయం తెలిసిందే.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన అభియోగం మీద తనపై కేసు నమోదు చేయడం పట్ల రేణుకా చౌదరి స్పందిస్తూ.. తానేమీ ఎస్ఐ కాలర్ పట్టుకోలేదని, ఆందోళనలో కిందపడితే పైకి లేవడానికి ఆసరా కోసం ఎస్ఐ కాలర్ పట్టుకున్నట్టు వివరణ ఇచ్చారు. ఆమె సమాధానానికి పోలీసు అధికారులు కళ్లు తిరిగి కిందపడబోయి ఎదుట నిల్చున్న వారి కాలర్ పట్టుకొని నిభాయించుకోవాల్సి వచ్చిందట!
– వెల్జాల
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

