Ayodhya | అయోధ్య తవ్వకాల్లో అరుదైన చరిత్ర
అది 2003 మే నెల. నేను ఔట్‌లుక్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న రోజులవి. ఫైజాబాద్ (ప్రస్తుత అయోధ్య)కు చెందిన ఓ బంధువు నుంచి ఫోన్ వచ్చింది. ‘వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ నేతృత్వంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాల్లో ఏం బయటపడుతున్నదో మీకు తెలుసుకోవాలని ఉందా?’ అని ఆయన అడిగారు.
Ayodhya | అది 2003 మే నెల. నేను ఔట్‌లుక్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న రోజులవి. ఫైజాబాద్ (ప్రస్తుత అయోధ్య)కు చెందిన ఓ బంధువు నుంచి ఫోన్ వచ్చింది. ‘వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ నేతృత్వంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాల్లో ఏం బయటపడుతున్నదో మీకు తెలుసుకోవాలని ఉందా?’ అని ఆయన అడిగారు. వెంటనే యాజమాన్యంతో మాట్లాడి లక్నోకు బయల్దేరాను. అక్కడినుంచి అయోధ్యకు చేరుకున్నా.
బాబ్రీ మసీదు నిర్మించకముందు వివాదాస్పద ప్రాంగణంలో రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లున్నా యో? లేదో తేల్చాలని అలహాబాద్ హైకోర్టు అదే ఏడాది మార్చిలో ఏఎస్ఐను ఆదేశించింది. అప్పటినుంచి అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ ఫొటోలు తీయడం నిషిద్ధం. అందుకే కెమెరా ఉండే ఫోన్‌తో చిత్రీకరించాలనుకున్నా. అప్పట్లో అది చాలా ఖరీదు. భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫోన్ లోపలికి తీసుకెళ్లేందుకు వీలుకాలేదు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఏఎస్ఐ 4 x 4 మీటర్లు ఉండే కందకాలుగా విభజించింది. రెండు కందకాల మధ్య ఒక మీటరు దూరం ఉన్నది.
అక్కడేం జరుగుతున్నదో ప్రజలకు తెలియనివ్వడం లేదు. పర్యవేక్షకులు ప్రత్యేకమైన ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నారు. రామ్ లల్లాను చూసేందుకు వెళ్తున్న భక్తుల కోసం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం మధ్యలో నుంచి ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటుచేశారు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో భక్తులకు తెలియకుండా పై నుంచి కింది వరకు ఇనుప గ్రిల్స్‌తో పాటు పరదాలు కట్టారు. భక్తులతో పాటు నేనూ లోపలికి వెళ్లాను. ఆ కారిడార్‌లో నిలబడి పరదాల వెనుక ఏం జరుగుతున్నదోనని గమనిస్తున్నాను. ‘245, 175, 160’.. అంటూ కూలీలు అరుస్తున్నారు. ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్న కుతూహలం మరింత ఎక్కువైంది. రెండు పరదాలను కలుపుతున్న కుట్లను విప్పదీశాను. ఆ సమయంలో నన్ను పోలీసులు చూస్తే కచ్చితంగా అరెస్టు చేస్తారని నాకు తెలుసు. నా గుండె వేగంగా కొట్టుకుంటున్నది. అయినప్పటికీ నేను చేస్తున్న పని ఆపలేదు. కోట్ల మంది భారతీయుల ఆశలు, శతాబ్దాలుగా దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు అక్కడివారంతా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎప్పుడు వచ్చేస్తారో తెలియడం లేదు. ఒకటి, రెండు నిమిషాలకు మించి సమయం లేదని మాత్రం తెలుస్తున్నది. అయినా ఆ టన్నెల్లో సుమారు గంట పాటు ఉన్నాను. ఎవరూ చూడనప్పుడు పరదాల వెనుక నుంచి చూస్తున్నా. కొద్దిసేపటికి పురాతన కాలం నాటి మెట్లను వాళ్లు వెలికితీశారు. నల్లటి రంగులతో ఉన్న చాలాపెద్ద గోళాకారం లాంటి ఆకృతి కనబడ్డది. దాన్ని గమనిస్తే గతంలో అక్కడ యజ్ఞయాగాదులు చేసినట్టనిపించింది. బాబ్రీ మసీదు కింద మసీదును మించిన ఓ నిర్మాణం ఉందనడం లో సందేహం లేదని నాకర్థమైంది. కానీ, అది గుడినా? ప్యాలెసా? అనేది కచ్చితంగా చెప్పలేను. అక్కడ మాత్రం ఏదో నిర్మాణం ఉందని గట్టిగా చెప్పగలను.
తర్వాతి రోజు ఉదయాన్నే కొంతమంది స్థానికులను కలిశా. రామమందిరం స్కేల్ మోడల్‌నూ చూశాను. జనవరి 22న ఆవిష్కరించనున్న ఆలయానికి భిన్నంగా ఉందది. చెక్కిన రాతిస్తంభాలు, రాతి పలకలు తదితర నిర్మాణ సామగ్రి ఉన్న యార్డును సందర్శించాను. ‘అనుమతి వస్తే రేయింబవళ్లు కష్టపడి ఆలయం నిర్మిస్తామని’ కొంతమంది యువకులు నాతో చెప్పారు. ‘అయోధ్యను కొంతమంది పవిత్రస్థలంగానే చూస్తారు. కానీ, ఇది యోధుల నగరం. లక్ష్మణ్ ఖిల్లా, హనుమాన్ గఢీ, చోటీ చావ్నీ తదితర ప్రదేశాలు ఇక్కడే ఉన్నాయి. క్షత్రియ ధర్మం ఇక్కడే ఉన్నది’ అని ఒకతను నాతో చెప్పారు.
ఆ తర్వాత 1949లో రామ్ లల్లాను బాబ్రీ మసీదు సెంట్రల్ డోమ్ కింద ప్రతిష్ఠించిన వారిలో ఒకరిగా చెప్పుకుంటున్న వ్యక్తిని కలిశా. ఈ ఘటన తర్వాత వివాదాస్పద ప్రాంగణాన్ని మూసివేశారు. అనంతరం షా బానో ఉదంతం జరిగాక.. హిందువుల మనోభావాలను శాంతింపజేసేందుకు రాజీవ్‌గాంధీ హయాంలో గేట్లు తెరిచారు.
చర్రితకారులు, న్యాయవాదులు, పర్యవేక్షకులను కలిశా. వారి సాయంతో అక్కడ ఉండే నిర్మాణానికి సంబంధించిన రఫ్ మ్యాప్‌ను తయారుచేశాను. దాన్ని ప్రచురించగా అది సంచలనంగా మారింది. ఆ తర్వాత జాతీయ మీడియాతో పాటు యూపీ మీడియా కూడా ఏఎస్ఐ కార్యకలాపాలను ప్రచురించాయి. నేను రాసినదంతా స్థానిక జర్నలిస్టులకు తెలిసిందే. కానీ, ఆ విషయాలను వారు పట్టించుకోలేదు. స్థానికంగా తెలిసిన విషయాన్నే జాతీయస్థాయిలో నేను వెలుగులోకి తీసుకువచ్చా. బాబ్రీ మసీదు కింద ఉన్నది గుడేనని నేను ఎన్నడూ చెప్పలేదు. కానీ, నేను రాసిన ప్రతి అక్షరం నిజమేనని.. ఆరు నెలల తర్వాత ఏఎస్ఐ విడుదల చేసిన నివేదికలో తేలింది.
పెద్ద పెద్ద కందకాలు, పదుల సంఖ్యలో పర్యవేక్షకులు, పోలీసుల పహారాలో వందలాది కూలీలు
చేతిలో పలుగు, పార పట్టుకొని తవ్వుతున్నారు. ఏ చిన్న వస్తువు దొరికినా దాన్ని భద్రపరుస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)’ బృందం, పర్యవేక్షకులు, న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా అలహాబాద్ హైకోర్టు జారీచేసిన పాసులుంటేనే. ఇదంతా ఏమిటనుకుంటున్నారా? నేడు అయోధ్య రామమందిరం నిర్మితమైన ప్రాంగణంలో.. ఒకప్పుడు ఏఎస్ఐ తవ్వకాలు జరిపిన నాటి జ్ఞాపకం.
-సందీపన్ దేబ్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

