నవోదయానికి వాగ్దానం
పోరాటాల పురిటి గడ్డ లోని అణువణువునా మట్టి రేణువులనడుగు పారిన నెత్తుటి మడుగుల గాథను ఆర్ధ్రంగా వినిపిస్తాయి
పోరాటాల పురిటి గడ్డ లోని
అణువణువునా మట్టి రేణువులనడుగు
పారిన నెత్తుటి మడుగుల గాథను
ఆర్ధ్రంగా వినిపిస్తాయి
ఈ నేలను తడిమి చూడు
రజాకార్ల రక్తపాతపు అరాచకాలు
మితిమీరిన దౌర్జన్యాలు అగుపిస్తాయి
గోల్కొండ పునాది రాళ్లను
కదిలించిన వీర గాథలు..
కూలిన ఊళ్ల బురుజు శకలాల్లో
స్పష్టంగా కనిపిస్తాయి.
అవరోధాలు, అడ్డంకులు
ఆక్రమణలు, అకృత్యాలు
నిరంకుశత్వం, నిషేధాజ్ఞలు
అన్నింటిని దాటి…
స్వేచ్ఛా, స్వతంత్రపు ఊపిరులూదిన
తెలంగాణ సాయుధ పోరాటం
నిజాం నిరంకుశానికి పాడింది చరమ గీతం
సమానత్వానికి సాటిగా నిలబడుతూ
కుల, మత ప్రమేయం లేని దేశమై వర్ధిల్లుతూ
మానవత్వమే అభిమతమని నమ్ముతూ
ఈ నేలన ఎగిరింది మువ్వన్నెల పతాకం
త్రివర్ణ వెలుగులమై
జాతి జీవన జ్యోతులమై
సమైక్యతా రాగాలను ఆలపిస్తూ
స్నేహ హస్తాల్ని కలిపి
రేపటి నవ ఉదయానికి వాగ్దానం చేస్తున్నాం
భావి భారత భవిష్యత్తుకై ఒక్కటై వస్తామని..
భిన్న సంప్రదాయాలు
విభిన్న సంస్కృతులున్నా…
భిన్నత్వంలో ఏకత్వమై
ఐక్యతతో గళం కలుపుదాం
జాతీయ సమైక్యతకు జవసత్వాలనందిద్దాం.
– ఎన్.లహరి, 9885535506
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

