కడుపున పడ్డ క్షణంలోనే తానామె కన్న కొడుకు
నవమాసాలూ మోసిన స్త్రీ తన తల్లి
భూమి మీద పడ్డనాడే ఈ భూమి పుత్రుడు
ఏ నేల తను బతుకటానికి
పనికొచ్చిందో అదే
తన మాతృభూమీ ఖండం
అవలోకనలు ఆలోచనల గుచ్ఛమైనప్పుడు
తన మనస్సే తన నిష్ఠ చరిత
నిత్య గమనం సుస్థిర కీర్తిగమ్యమై…
ఏ మనుషులు తనను నమ్మి
తనకు ఇట్లా బతక నేర్పిన్రో
వీళ్ళే తన తొలి గురువులు
తెలియని సంగీతంలా
తెలిసిన దీవెనలా
శతమానం భవతి ఊపిరిదాకా
ఇక
తనకు బతుకు రుచి ఇదేనని
ఇది కలకాదని
వెలిసిపోనిచ్చుకోవద్దనే
మహాదీక్షా సంకల్పమే
తన పిడికిలి పట్టు
తన గుండె మట్టు
లోగుట్టు తనకే ఎరుక
అని చెప్పిందే
మరి మరి చెప్తున్నదే
తన మనసు భాష,
అది ఒక్క మాటే…
లక్షల భావోద్వేగాల పాటే
కోట్ల గళాల ఏక నినాదమే
ఓ జన హృదయ నాయకా!
ఇక నీ నినాదం…
త్రిజయ పదయుగ్మ
జై తెలంగాణ
జైజై మేరా భారత్ మహాన్
గురిజాల
రామశేషయ్య: 70326 79471