తెలుగు సినీగీతాల వినీలాకాశంలో
అలుపులేక కాచిన ‘సిరివెన్నెల’
నేడు చందమామలో కలిసిపోయింది!
గగన ‘గంగావతరణం’తోడుగా
శివుని సిగలో విలసిల్లిన జాబిల్లి
తన వెన్నెలను తానే మింగేసింది
జాగృతవీణలు మూగవోయాయి
దినకరమయూఖాలకు గ్రహణం పట్టింది
జగమంతా తన కుటుంబమే అంటూ
తరలిపోయింది ఆత్మ
పరమశివుని పాదపద్మంలోనికి!
మనోవీధిలో ‘సిరివెన్నెల’ ఎన్నటికీ
మరపురాదు, మాసిపోదు..!
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
94404 68557