వికీలీక్స్ వీరునికి విముక్తి
అసాంజే ఓ సాధారణ కలం వీరుడు. అయితే సమాచార స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని పణంగా ఒడ్డి, కత్తుల వంతెన దాటాడు. అగ్రరాజ్య ఆగ్రహజ్వాలలు తట్టుకుని నిలిచాడు. అతని పోరాటాన్ని, త్యాగాలను ప్రపంచం చాలాకాలం పాటు గుర్తుంచుకుంటుంది.
అసాంజే ఓ సాధారణ కలం వీరుడు. అయితే సమాచార స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని పణంగా ఒడ్డి, కత్తుల వంతెన దాటాడు. అగ్రరాజ్య ఆగ్రహజ్వాలలు తట్టుకుని నిలిచాడు. అతని పోరాటాన్ని, త్యాగాలను ప్రపంచం చాలాకాలం పాటు గుర్తుంచుకుంటుంది. ప్రభుత్వ రహస్యాల గనులను తవ్విపోసి ప్రపంచం ముందు పరచడమే అతడు చేసిన మహానేరం. సర్కారీ చీకటి కోణాలపై వెలుగులు ప్రసరించడమే ఘోరపాపం. వికీపీడియా యుగంలో అసాంజే వికీలీక్స్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ భూకంపం సృష్టించాయి. ప్రస్తుత సమాచార హక్కు యుగంలో ప్రభుత్వాలు అధికార రహస్యాల ముసుగు కింద కమ్మేసే అకృత్యాలను వెలికితీసే పని ఓ మహా సాహసమే.
ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాలి. ఎవరో ఒకరు మన కోసం చరిత్ర గతిని శాసించాలి. ఆ పని అసాంజే చేశాడు. మీడియా శక్తి ఏమిటో, పారదర్శకత విలువ ఏమిటో చాటిచెప్పాడు. టన్నుల కొద్దీ రహస్యాలు బయటపెట్టాడు. ఏం బయటపెట్టాడు? ఎంత బయటపెట్టాడు? అనేది ముఖ్యం కాదు. ఆ సాహసమే ఓ ఒరవడిని దిద్దింది. మీడియా అనేది రాజీపడుతూ ‘ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి’ కిందికి జారి సైడు కాలువల్లో ప్రవహిస్తున్న వేళ అసాంజే అద్వితీయమైన రీతిలో భావప్రకటనా స్వేచ్ఛా పతాకాన్ని ఎగరవేశాడు. స్వేచ్ఛా పిపాసులకు ఓ హీరోలా, ప్రభుత్వాల పాలిట విలన్లా నిలిచాడు.
అసాంజే స్థాపించిన వికీలీక్స్ ప్రజల దృష్టికి ఎన్నడూ రాని రహస్య పత్రాలను తవ్వితీస్తే ప్రభుత్వాలు వణికిపోయాయి. ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయి. దౌత్యపరమైన వివాదాలూ తలెత్తాయి. రాజీనామాలు జరిగాయి. వికీలీక్స్‌లో బయటపెట్టినవి చిన్నాచితకా విషయాలేం కావు. అందునా అమెరికా పరువు తీసే రహస్యాలను వీధుల్లో ఊరేగిస్తే అగ్రరాజ్యం చూస్తూ ఊరుకుంటుందా?! ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు వెలుగులోకి వస్తే ప్రపంచం ఔరా అని ముక్కు మీద వేలేసుకుంది.
యుద్ధం ముసుగులో జరిగే నేరాలు, ఘోరాలను వెలికితీయడం సంచలనం కలిగించింది. ఇరాక్ యుద్ధంలో అమెరికా హెలికాప్టర్ ఇద్దరు జర్నలిస్టులతో సహా 11 మంది సాధారణ పౌరులను కాల్చిచంపి, వారికి సాయంగా వచ్చిన వ్యానుపైనా గుండ్లవర్షం కురిపించే వీడియో దుమారం రేపింది. అమెరికాను ఇరకాటంలో పడేసింది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా చెప్పుకునే అమెరికా అసలు స్వరూపం ఇదీ అని ప్రపంచానికి చాటిచెప్పడమంటే సింహం జూలుతో ఆడుకోవడం లాంటిదే. అది పిల్లలాట కాదు.
అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) విదేశీ నేతలపైనే కాదు, పౌరులపైనా నిఘా వేసిందని, పాకిస్థాన్ మొబైల్ నెట్‌వర్క్‌లోకి చొచ్చుకుపోయిందని అసాంజే వెల్లడించడం మరో సంచలనం. సర్వశక్తివంతమైన ప్రభుత్వాలను ఢీకొట్టడంలో సమస్యలుంటాయి. వికీలీక్స్ తెగువపై అమెరికా గుడ్లురిమింది. గూఢచర్య నేరం మోపి జైలులో పెట్టాలని తలపెట్టింది. వేట మొదలుపెట్టింది. కానీ అసాంజే చేతికి చిక్కితే కదా. బ్రిటన్‌లోని ఈక్విడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొంది సుదీర్ఘకాలం పాటు అక్కడే ఉండిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చాంశమైంది. తర్వాత బ్రిటన్ అరెస్టు చేసి జైల్లో పెట్టింది.
అటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ హక్కుల సంస్థలు అసాంజే నిర్బంధంపై నిరసన తెలిపాయి. ప్రపంచ ప్రజాభిప్రాయం కూడా అసాంజేకు అనుకూలంగా మారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అసాంజేను అమెరికా అదుపులోకి తీసుకుని విచారించింది. రాజీ ఫార్ములాలో భాగంగా నామమాత్రపు విచారణ జరిపి విడుదల చేసింది. ఓ వైపు అమెరికా గూఢచార రహస్యాల చట్టం ఉల్లంఘించినట్టు ఒప్పుకొన్న అసాంజే అమెరికాలో భావప్రకటనా స్వేచ్ఛకు దన్నుగా నిలిచే ఫస్ట్ అమెండ్మెంట్ సాయంతో గట్టెక్కడం విశేషం. ఎట్టకేలకు సంకెళ్లు ఛేదించుకుని అసాంజే స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం శుభపరిణామం.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
Eluru Ganganamma | ఏలూరు గంగానమ్మ ఆంథెమ్.. యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న భక్తి గీతం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

