Hyderabad | ఇద్దరు దొంగల అరెస్ట్.. 4 బైకులు, 1 ఆటో స్వాధీనం

దోమలగూడ: వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ముషీరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…..భోలక్పూర్ సిద్ధిఖ్నగర్కు చెందిన మహ్మద్ అజీజ్ ఈ నెల 29న తన అటో చోరీకి గురైనట్లు ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు ముషీరాబాద్ చౌరస్తా వద్ద అనుమానస్పదంగా కనిపించారు.
దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, గత రెండు నెలలుగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు దొంగలించి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. వారిని భోలక్పూర్లో నివాసముండే అవైజ్ అలీ(20), మహ్మద్ ఫైజన్(21)గా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరూ వాహనాల చోరీకి దిగారని పోలీసుల విచారణలో తేలింది. వారి వద్ద నుంచి ఐదు లక్షలు విలువ చేసే 4 ద్విచక్ర వాహనాలు, ఒక్క ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చిక్కడపల్లి సబ్ డివిజన్ ఏసీపీ చల్లా శ్రీధర్ బుధవారం వెల్లడించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

