Hyderabad | మతతత్వపార్టీల వైఖరికి నిరసనగా 8న ఐక్యతా ర్యాలీ

చాదర్ఘాట్ : రాష్ట్రాన్ని మతతత్వ పార్టీల నుంచి కాపాడుకునేందుకు, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు సెప్టెంబర్ 8న ఐక్యతా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తహరీక్ ముస్లిం షబ్బాన్ చైర్మన్ ముష్తాక్ మాలిక్ తెలిపారు.ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముష్తాక్ మాలిక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లౌకికవాదానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇటీవల చార్మినార్ వద్ద జరిగిన బీజేపీ పాదయాత్ర మొత్తం ముస్లింలను టార్గెట్ చేసే విధంగా ఉందని, ముస్లింలకు వ్యతిరేకంగా నినాధాలు చేశారని దుయ్యబట్టారు.
లౌకికవాదులను, మత పండితులను, రాజకీయేతర శక్తులందరిని ఏకం చేసి మతతత్వ పార్టీలను అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామన్నారు. వారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. మతతత్వ పార్టీల వైఖరిని నిరసిస్తూ 8న మధ్యాహ్నం రెండు గంటలకు చార్మినార్ నుంచి కులీకుతుబ్షా స్టేడియం వరకు ర్యాలీ నిర్వహిస్తామని, ఈ ర్యాలీలో హిందూ పూజారులు, క్రిస్టియన్ బిషప్, ముస్లిం మత పెద్దలు, స్కాలర్స్ పాల్గొంటారని తెలిపారు.ఈ సమావేశంలో ముజ్తబా, షకీల్, ఏం.ఏ.గఫార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

