ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీఫార్మసీ (పీసీఐ) రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, మొదటి సెమిస్టర్ సప్లమెంటరీ, బీఫార్మసీ (సీబీసీఎస్) మొదటి, రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్, బీఫార్మసీ (నాన్ సీబీసీఎస్) మొదటి సంవత్సరం బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును సంబంధిత కళాశాలల్లో ఈ నెల 30వ తేదీవరకు చెల్లించవచ్చని చెప్పారు.
ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
ఎంసీఏ పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంసీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలతో పాటు ఎంసీఏ (రెండేళ్ల కోర్సు) రెండో సెమిస్టర్ మెయిన్ పరీక్షలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూరిత వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.