ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం గడ్డిఅన్నారం డివిజన్ గౌతం నగర్‌కు చెందిన బాధితుడు గురునాథం భార్య శిరీషకు రూ. 4 లక్షల సీఎం రిలీఫ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేసుధీర్రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్యపరిరక్షణకు సీఎం సహాయనిధి దోహదమవుతోందన్నారు. కరోనా సమయంలో అనేక మంది తీవ్ర ఇక్కట్లకు గురయ్యారన్నారు. ఎంతో మందికి తమ ట్రస్తు ద్వారా చేయూతను అందించామన్నారు. అధునాతన వైద్యసేవలను పొందేందుకు సీఎం సహాయనిధి అండగా ఉంటోందన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ యువ నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.