సైదాబాద్ : మద్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇటీవల జరిగిన 64వ జాతీయ ఎయిర్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన మారియా తనీమ్ను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు యువజన సర్వీసుల, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం తన నివాసంలో అభినందించారు.
సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీకి చెందిన మారియా తనీమ్ 64వ జాతీయ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్, యూత్ ఉమెన్, జూనియర్ ఉమెన్ విభాగంలో అద్భుతమైన స్కోర్ సాధించి టీమ్ సెలక్షన్ ట్రయల్స్‌కు అర్హత సాధించి సత్తా చాటింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎయిర్ రైఫిల్ షూటింగ్లో మారియా తనీమ్ను తాను సాధించిన విజయాలను అడిగి తెలుసుకుని అభినందించారు.
ప్రభుత్వ పరంగా మారియా తనీమ్కు సహాయ సహకారాలను అందిస్తామని, అండగా ఉంటామని, ప్రభుత్వం క్రీడాకారులను, క్రీడాలను ప్రోత్సహిస్తూ, అధిక ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్తులో మంచిగా రాణించి రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలను తీసుకుని రావాలని ఆయన సూచించారు.