Ktr | ట్రాఫిక్ ఎస్సై ఐలయ్యగౌడ్ను సన్మానించిన కేటీఆర్

మెహిదీపట్నం : గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి పయనమవుతున్న సమయంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇన్నోవా కారు రాంగ్ రూట్లో ప్రయాణించడంతో ఆ కారుకు చలాన్ వేసిన టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఐలయ్యగౌడ్ను అభినందిస్తూ సోమవారం మంత్రి కేటీఆర్ సన్మానించారు.
అక్టోబర్ 2న లంగర్‌హౌస్ బాపూఘాట్లో గాంధీ జయంతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన తిరిగి వెళ్లే క్రమంలో మంత్రి కారును డ్రైవర్ రాంగ్రూట్లో నడిపాడు. దీనిని గమనించిన ఎస్ఐ ఐలయ్య గౌడ్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆ కారుకు చలాన వేశారు. విధుల్లో పూర్తి బాధ్యతగా వ్యవహరించి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేసినందుకు ఐలయ్యను ,కానిస్టేబుల్ వెంకటేశ్వర్లులను మంత్రి ప్రశంసించారు. ట్రాఫిక్ నియమనిబంధనలు ఎవ్వరికైనా ఒకటే అని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

