మాదాపూర్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా “ఎనిమీ” సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో సోమవారం మొక్కలు నాటారు.
అనంతరం విశాల్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ మానసపుత్రిక “హరితహారం” స్పూర్తితో ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది అన్నారు.
ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో వారు ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” గ్లోబల్ వార్మిగ్ను అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.
అంతేకాదు తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఈరోజు మొక్కని నాటుతున్నానని.. ఈ మొక్క తన స్నేహితునికి గుర్తుగా ఉంటుందని తెలిపారు.