సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలకు నిధుల మంజూరు : మంత్రి తలసాని

బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ఇటీవల డివిజన్లోని పాటిగడ్డ, ఓల్డ్ కస్టమ్స్ బస్తీలలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది తెలిపిన సమస్యలను బుధవారం మారేడ్‌పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు నివేదిక రూపంలో అందించారు.
దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తక్షణమే సమస్యల పరిష్కారానికి, కావలసిన ఏర్పాట్లకు నిధులు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో నైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించినట్టు కార్పొరేటర్ మహేశ్వరి తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

