Hyderabad | మూసీకి వరద ఉదృతి.. పరివాహక ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

చాదర్‌ఘాట్ : మూసీనదికి వరద ఉదృతి భారీగా పెరిగింది. జంట జలశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీనది పరవళ్లు తొక్కుతుంది. దీంతో చాదర్‌ఘాట్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో స్థానికులను వెంటనే అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, పోలీసుల్ అధికారులు కమల్‌నగర్, మూసానగర్, వినాయకవీధి తదితర మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
మూసీ వరద ఉదృతి పెరగడంతో చాదర్‌ఘాట్ కాజ్వే బ్రిడ్జి కి తాకుతూ ప్రవహిస్తుంది. దీంతో పోలీస్ అధికారులు ముందస్తుగా చాదర్‌ఘాట్ కాజ్వే బ్రిడ్జి పై నుంచి వాహనాల రాకపోకలను నిపిసేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, మూసీ వైపు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ దేవేందర్, చాదర్‌ఘాట్ సీఐ సతీష్ లు మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
ఎమ్మెల్యే పర్యటన…
జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరగడం వలన పరివాహక ప్రాంతాల్లో నివాస ముండే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, సౌత్ జోన్ కమిషనర్ సామ్రాట్ అశోక్, డీసీ రజినీకాంత్‌రెడ్డి లతో కలిసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. వరద ఉదృతి ని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ముందస్తు చర్యగా స్థానికుల కోసం పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

