శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండో రోజు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తొండుపల్లి పరిధిలో హమిదుల్లానగర్కు వెళ్లే రోడ్డులో అనుమతి లేకుండా ప్రహరీ నిర్మించడంతో గురువారం కూల్చివేశారు. రాయల్ విల్లాస్ వెంచర్లో పలు నిర్మాణాలు కూల్చివేశామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 60 పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేస్తామని తెలిపారు.