Chakali ilamma | భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ : మాగంటి గోపీనాధ్

వెంగళరావునగర్ : భూస్వామ్య వ్యవస్థ పై తిరుగుబాటు చేసి,ఆ వ్యవస్థను రూపుమాపేందుకు పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అన్నారు. జవహర్ నగర్ కూడలి వద్ద ఆదివారం డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ముఖ్యఅతిధిగా పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ కృషి మరవలేనిదని, మహిళల్లో చైతన్యం నింపిన ధీర వనిత ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, రాజు రజక, బాలు రజకతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

