Mla gandhi | వరద నీటి కాలువ నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచండి : విప్ గాంధీ

కొండాపూర్ : వరద నీటి కాల్వ నిర్మాణ పనులు వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రూ. కోటి అరవై లక్షల వ్యయంతో చేపట్టిన సాయి వైభవ్ కాలనీ వరద నీటి కాలువ పనులను మాజీ కార్పొరేటర్ సాయిబాబా, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్ళేలా నిర్మిస్తున్న వరద నీటి కాలువ పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజా సంక్షేమం కోసం జీహెచ్ఎంసీ, మాన్సూన్ బృందాలు నిత్యం విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, ఏఈ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

