Shilpa Garden | శిల్పాగార్డెన్ అభివృద్దికి కృషి చేస్తా : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కొండాపూర్ శిల్పాగార్డెన్లో గురువారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పర్యటించారు. కాలనీలో స్థానికంగా కొనసాగుతున్న భూగర్బ డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిల్పాగార్డెన్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ నిర్మాణ పనులను సైతం వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెవాలని సంబందిత అధికారులకు తెలిపారు. పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యతతో ఎక్కడ రాజీ పడోద్దని సూచించారు.
ప్రజలకు మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం జరుగుతుందని, తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ ప్రాదాన్యత క్రమంలో పరిష్కారం చేపట్టడం జరుగుతుందన్నారు. డ్రైనేజీ, రోడ్లు, మంజీరా, విద్యుత్ లాంటి మౌళిక వసతులను కల్పించేందుకు అహర్నిశలు పాటుపడుతున్నానని పేర్కొన్నారు.
శిల్పాగార్డెన్ కాలనీ అభివృద్దికి కృషిచేస్తానన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ రమేష్, ఏఈ సునీల్, శిల్పాగార్డెన్ వాసులు రామకిశోర్, అపూర్వ, శ్రీవాత్సవ, రాజశేఖర్, సందీప్, శ్రావణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

