e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 11, 2021
Advertisement
Home జిల్లాలు రైతుల సంఘటితం కోసమే వేదికలు

రైతుల సంఘటితం కోసమే వేదికలు

రైతుల సంఘటితం కోసమే వేదికలు

జడ్చర్ల, ఏప్రిల్‌ 8 : రైతుల సంఘటితం కోసమే ప్రభు త్వం రైతువేదికలను ఏర్పాటు చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాల గ్రామంలో నిర్మించిన రైతువేదికను ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను ఏకం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. రైతులు తమ సమస్యలను తెలియజేసేందుకు, ధాన్యం అమ్మకాలు, మార్కెటింగ్‌, ధరలు తదితర వివరాలను తెలుసుకునేందుకు వేదికలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం దేశం లో ఎక్కడా లేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని వివరించారు. అలాగే రైతులకు సాగునీటి వసతి కల్పించేందుకు ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచారన్నారు. ఏడాదిన్నరలోగా కరివెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామన్నారు. అనంతరం ఆర్‌ఏహెచ్‌ పథకం కింద పెద్ద ఆదిరాల, చిన్న ఆదిరాల తదితర గ్రామాల రైతులకు కోడిపిల్లలు, సేంద్రియ ఎరువులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు.
మున్సిపాలిటీలో పర్యటన
బస్తీబాట కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని బూరెడ్డిపల్లి, శివాజీనగర్‌, అబుల్‌కాలం కాలనీల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూరెడ్డిపల్లి వార్డులో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అలాగే మురుగుకాల్వ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శివాజీనగర్‌ కాలనీలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వర్షపునీరు, మురుగు నిల్వకుండా చూడాలని తెలిపారు. అదేవిధంగా శివాజీనగర్‌లో మురుగుకాల్వ నిర్మాణం చేపట్టాలని కమిషనర్‌ సునీతకు సూచించారు. జడ్చర్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, జెడ్పీ వైస్‌చైర్మన్‌ యాదయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాట్రపల్లి లక్ష్మయ్య, పీఏసీసీఎస్‌ చైర్మన్లు సుదర్శన్‌గౌడ్‌, మల్లేశ్‌, సర్పంచ్‌ కృష్ణాబాయి, ఏడీఏ అనిల్‌కుమార్‌, ఏవో రాంపాల్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ జంగయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కోట్ల ప్రశాంత్‌రెడ్డి, బృందంగోపాల్‌, నర్సింహులు, నాగిరెడ్డి, రమేశ్‌జీ, నర్సింహారెడ్డి, గంగ్యానాయక్‌, రామలింగారెడ్డి, మాజీ సర్పంచులు శివరాంరెడ్డి, సత్యయ్య, వెంకటేశ్‌, రేణుక, ఏఈవోలు మహేశ్వర్‌, గౌస్‌పాషా, నవనీత, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రైతుల సంఘటితం కోసమే వేదికలు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement