Illegal structures | జూబ్లీహిల్స్‌లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం

బంజారాహిల్స్ : అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కామన్ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన షటర్లను జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కూల్చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లోని అనితా ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్‌కు చెందిన సెట్ బ్యాక్, కామన్ ఏరియాలో గత కొన్ని రోజులుగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు.
ఈ విషయంపై టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి ఫిర్యాదులు అందడంతో గతంలోనే కూల్చివేతలు చేపట్టారు. కాగా మూడు రోజుల క్రితం వరుస సెలవులు రావడంతో సదరు బిల్డర్లు షటర్ల నిర్మాణం చేపట్టారు. ఆగమేఘాల మీద నిర్మాణాలు పూర్తి చేసి రంగులు వేసుకున్నారు.
ఈ వ్యవహారంపై అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో తక్షణమే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మేయర్ జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
దీంతో జూబ్లీహిల్స్ పోలీసుల బందోబస్తు నడుమ సర్కిల్-18 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ రాజ్‌కుమార్ నేతృత్వంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా నిర్మాణదారులు టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల జోక్యంతో కూల్చివేతలను కొనసాగించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

