డమస్కస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్(Emmanuel Macron) ప్రస్తుతం సిరియా పర్యటనలో ఉన్నారు. అయితే ఆయన డమస్కస్లోని ఫోర్ సీజన్స్ హోటల్లో బస చేస్తున్నారు. ఆ హోటల్ ముందు ఇవాళ బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకున్నది. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాను కలిసేందుకు అధ్యక్ష కార్యాలయంలోకి మాక్రన్ వెళ్లిన తర్వాత ఆయన బస చేస్తున్న హోటల్ వద్ద పేలుడు ఘటన జరిగడం శోచనీయం. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. దాంట్లో నలుగురు పోలీసులు కూడా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చర్చలు చేపట్టేందుకు మాక్రన్ పలు దేశాల్లో పర్యటిస్తున్నారు.
సోమవారం సిరియా చేరుకున్న ఆయన.. ఆ తర్వాత టర్కీలో జరిగే నాటో సమావేశాలకు వెళ్లనున్నారు. ఫోర్ సీజన్స్ హోటల్ ముందు రెండు ప్రదేశాల్లో పేలుళ్ల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ పర్యటనలో ఎటువంటి మార్పు ఉండబోదని ఎలిసిస్ ప్యాలెస్ తన ప్రకటనలో పేర్కొన్నది. ఫోర్ సీజన్స్ హోటల్ వద్ద జరిగిన పేలుళ్లకు చెందిన వీడియోలు, ఇమేజ్లు వైరల్ అవుతున్నాయి. భారీ స్థాయిలో మంటలు, సొగ కమ్ముకున్నది.
సిరియా ప్రెసిడెంట్ అల్ షరా .. మాక్రన్కు స్వాగతం పలికారు. పేలుళ్లు జరిగిన సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోటల్లో లేరని తెలిసింది. బాషర్ అల్ అసద్ పాలన ముగిసిన తర్వాత యూరోప్ దేశ ప్రతినిధి సిరియాకు వెళ్లడం ఇదే తొలిసారి.