పండుగలను ప్రశాంతంగా జరపుకోవాలి

కందుకూరు : పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని కందుకూరు పోలీస్ స్టేషన్ సీఐ లిక్కి కృష్ణంరాజు కోరారు, శుక్రవారం మొహర్రం సందర్భంగా ఆయన మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన అనంతరం దాసర్లపల్లి గ్రామంలో బీబీకా అలంకు దట్టిలను సమర్పించారు. ఈ సందర్భంగా ముస్లీం సొదరులు సీఐకి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలన్నారు. పండుగలు ఎవరివైనా ప్రశాంతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. మొహర్రం పండుగను ముస్లీంలు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని చెప్పారు. ప్రభుత్వం పండుగలకు ప్రాధాన్యతను ఇస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పొలెమోని బాలమణి అశోక్ ముదిరాజ్, పలువురు ముస్లీం సోదరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ఊరేగింపు..
మండల పరిధిలోని కందుకూరు, కొత్తగూడ, దాసర్లపల్లి, అగర్మియగూడ, మహమ్మద్నగర్, నేదునూరు, పులిమామిడి, గూడూరు తదితర గ్రామాల్లో బీబీకా అలంను ముస్లీంలు ఆయా గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. పలువురు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఊరేగింపు అనంతరం గ్రామాల్లో చెరువులు, కుంటలలో నిమ్మజ్జనం చేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు సులేమాన్, ఆసీఫ్ అలీ, కమాల్భేగ్, అప్జల్ భేగ్, అంజద్, ఖదీర్, అజీజ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

