Love harassment | ప్రేమ పేరుతో అసభ్యంగా ప్రవర్తించిన యువకునిపై కేసు

బంజారాహిల్స్ : తనను ప్రేమించాలంటూ వేధింపులకు పాల్పడడంతో పాటు యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ సమీపంలోని శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న యువతి (26) రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తుంది.
గతంలో బండ్లగూడ సమీపంలోని సన్‌సిటీలో నివాసం ఉంటున్న సమయంలో ఆమెకు పరిచయమయిన రవికిరణ్ అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురిచేస్తుండేవాడు. దాంతో అతడి వేదింపులు తాళలేక ఇటీవల మణికొండకు వచ్చి నివాసం ఉంటుంది. అయినా తిరిగి యువతిని వేధించడంతో గతంలోనే రాయదుర్గం పీఎస్ లో కేసు నమోదయింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 24న సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 గాయత్రీహిల్స్‌లోని బ్యూటీ పార్లర్‌కు వచ్చిన యువతిని వెంబడిస్తూ వచ్చిన రవికిరణ్ ఆమెను బయటకు లాక్కొచ్చాడు. అంతటితో ఆగకుంటా తనను ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తూ కారులోకి ఎక్కించుకున్నాడు.
దీంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ మేరకు బాదితురాలు అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. ఈ మేరకు శనివారం రాత్రి బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రవికిరణ్‌పై ఐపీసీ 354(ఏ),(డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

