వైద్యం అందరికీ ఒకేలా అందించాలి

వ్యాక్సినేషన్ తప్పనిసరి
క్షేత్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఈవో రామారావు
శ్రీశైలం, మే 11: శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులతోపాటు దేవస్థాన సిబ్బందికి, స్థానిక ప్రజలందరికీ వైద్యం ఒకేలా అందించాలని ఈవో కేఎస్ రామారావు అన్నారు. మంగళవారం ఉదయం క్షేత్ర పరిధిలోని పలు విభాగాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున సదన్‌లో రెండో విడుత వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని కొవిడ్‌బారి నుంచి తమనుతాము రక్షించుకోవాలని సూచించారు. డాక్టర్ సోమశేఖర్, ఆలయ భద్రతా పర్యవేక్షకుడు శ్రీహరి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. అనంతరం దేవస్థాన దవాఖానలో యాత్రికులు, స్థానికులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు అవసరమైన సదుపాయాలతోపాటు ఓపీ పేషెంట్ల కోసం కావాల్సిన మందులను సమకూర్చుకోవాలని అపోలో వైద్యుడు మహేశ్‌కు సూచించారు. అదేవిధంగా గోశాలలో ఆవుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎండలకు తట్టుకునేలా తాటిఆకుల చలువపందిళ్లు మరిన్ని వేయాలని అన్నారు. ఈవో వెంట ఏఈవోలు కృష్టారెడ్డి, డీ మల్లయ్య, పర్యవేక్షకులు మధుసూదన్‌రెడ్డి, స్వాములు, శ్రీశైలప్రభ సంపాదకుడు అనిల్‌కుమార్ ఉన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

