యాదాద్రిలో ఉత్సవాలకు అంకురార్పణ.. కాళేశ్వర జలాలతో స్వామివారికి అభిషేకం
Yadadri | యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్య పూజా కైంకర్యాలు చేపట్టి, బాలాలయ ముఖ మండపంలో తూర్పు
యాదాద్రి: యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్య పూజా కైంకర్యాలు చేపట్టి, బాలాలయ ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా సువర్ణ మూర్తులను అధిష్టింప జేశారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వయంభువుల అనుమతి నిమిత్తం ఉదయం 9.35 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహామూర్తి, ఆలయ ఈవో గీత.. ప్రధానాలయంలోకి వెళ్లారు.

స్వామి వారి చెంతకు కాళేశ్వరం జలాలు..
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వామి వారికి అభిషేకానికి కాళేశ్వరం గోదావరి జలాలను వినియోగించారు. కాళేశ్వరం 15వ ప్యాకేజీలో నిర్మించిన ఆఫ్టేక్ 2 నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికారు. గోదావరి శుద్ధ జలాలను రాగి చెంబుతో తీసుకువచ్చి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

