Sankranti Special | సంక్రాంతి పురుషుడు అంటే ఎవరు? ఆయన ఎలా ప్రభావం చూపిస్తారు?
Sankranti Special | ప్రతి ఉగాదికీ పంచాంగ శ్రవణం సందర్భంగా ‘సంక్రాంతి పురుషుడు’ మీద పెద్ద చర్చే జరుగుతుంది. ఆయన రూపం, లక్షణాల గురించి సిద్ధాంతులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు
Sankranti Special | ప్రతి ఉగాదికీ పంచాంగ శ్రవణం సందర్భంగా ‘సంక్రాంతి పురుషుడు’ మీద పెద్ద చర్చే జరుగుతుంది. ఆయన రూపం, లక్షణాల గురించి సిద్ధాంతులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. సంక్రాంతి పురుషుడి రూపురేఖలు, అధిరోహించిన వాహనం, ధరించిన దుస్తులు, పట్టుకున్న ఆయుధాలు ఇవన్నీ ఆ సంవత్సర ఫలితాన్ని శాసిస్తాయని విశ్వసిస్తారు. ఎవరీ సంక్రాంతి పురుషుడు? ఆయనకు ఎందుకు ఇంత ప్రాధాన్యం?
మకర సంక్రాంతి నాటి సూర్యశక్తికే సంక్రాంతి పురుషుడు అని పేరు. సంక్రమణ పర్వదినం సందర్భంగా శుభాశుభాలు తెలియజేసే విధంగా ఆ శక్తి సాక్షాత్కరిస్తుంది. రవి సంక్రమణం జరిగే తిథి, వారం, నక్షత్రాన్ని అనుసరించి సంక్రాంతి పురుషుడి లక్షణాలను, ఆయన అనుగ్రహాన్ని వివరించారు మన పూర్వికులు. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2.06 గంటలకు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆదివారం ఉదయం సంక్రాంతి పండుగ జరుపుకోవాలి.
ఆదివారం: సామాన్య వర్షాలు
అష్టమి తిథి: ధర పెరుగుదల
కృష్ణ పక్షం: సుభిక్షం
చిత్తా నక్షత్రం: ధాన్యాభివృద్ది
రాక్షస నామధేయం: దుష్టులకు అరిష్టం
పెసల అక్షతల ధారణ: పెసర పంటలకు నష్టం
నీలిరంగు ఆభరణాలు ధరించడం: క్షేమం
చందన గంధ విలేపనం: ఆరోగ్యం
జాజీ పుష్పం ధరించడం: కీర్తి
రజతపాత్ర భోజనం: వెండి ధరలో పెరుగుదల
పులి వాహనం: మృగాలకు హాని
ముహూర్త ఫలం: శుభ్రపదం
ఇలా మకర సంక్రమణ సమయం, సంక్రాంతి పురుషుడి లక్షణాలను బట్టి ఫలితాలను నిర్దేశించారు సిద్ధాంతులు. మొత్తంగా సంక్రాంతి పురుషుడు మిశ్రమ ఫలితాలు ఇవ్వనున్నాడు. సంక్రాంతి పుణ్యకాలం ఇవాళ్టి సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుంది. ఈలోగా నోములు ఆచరించాల్సి ఉంటుంది. సంక్రమణ పర్వదినం సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. శక్తిమేరకు దానాలు చేయాలని పెద్దలు సూచించారు. సూర్య భగవానుడి ఆరాధన వల్ల అభీష్టాలు సిద్ధిస్తాయి.
Read More :
sankranti special | సంక్రాంతి ముందు భోగి మంటలు ఎందుకు వేస్తారు? దీని వెనుక కారణమేంటి?
Sankranti Special | భోగి రోజు పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు?
“Sankranti Special | గంగిరెద్దులాటకు ఎలాంటి గిత్తలు కావాలి? వాటిని ఎలా అలంకరిస్తారు?”
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

