Sankranti Special | భోగి రోజు పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు?
Sankranti Special | తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంబురాల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ. ప్రతి లోగిలి ధాన్యరాశులతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది.
Sankranti Special | తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంబురాల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ. ప్రతి లోగిలి ధాన్యరాశులతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ ‘భోగి’తో భోగ భాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ని చేపట్టిన రోజు కూడా ఇదే. భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉన్నది. ఈ సంప్రదాయం వెనుక ఆరోగ్యకరమైన కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను భోగి పండ్లుగా వాడతారు. రేగు పండ్లకు బదరీఫలాలని పేరు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా, వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు.
Read More :
సంక్రాంతి తర్వాత ఆరు నెలల ప్రత్యేకత ఏంటి? ఆ టైంలో ఏం జరుగుతుంది?
Sankranti Special | గంగిరెద్దులాటకు ఎలాంటి గిత్తలు కావాలి? వాటిని ఎలా అలంకరిస్తారు?
సంక్రాంతికి పతంగులు ఎగురవేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
సంక్రాంతి నిలబెట్టడం అంటే ఏమిటి? ఈ సమయంలో పెండ్లిళ్లు చేయకూడదా?”
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

