Vinayaka Chavithi | వినాయకుడికి సహస్రం పైగా పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఆయన్ను విఘ్నేశ్వరుడు, గణపతి, లంబోదరుడు, గజాననుడు వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. అలాగే, విఘ్నేశ్వరుడి రూపాలు ఒకటి రెండు కావు.. 32 రూపాలలో భక్తులతో పూజలందుకుంటాడు. సాధారణంగా ప్రజలలో షోడశ గణపతులు అంటే 16 ప్రధాన గణపతి రూపాల గురించి మాత్రమే అవగాహన ఉంటుంది. అయితే, ఈ షోడశ గణపతులు కూడా 32 గణపతుల్లో భాగంగానే ప్రాముఖ్యత ఉంది. ఈ 16 రూపాల్లో అత్యంత ప్రముఖమైనది మహాగణపతి. పూజల్లో ఎక్కువగా ఈ రూపాన్నే ఆరాధిస్తుంటారు.
ఈ 32 రూపాల వినాయకుడికి మన భారతీయ సంస్కృతిలో ఎనలేని స్థానం ఉంది. ప్రతీ రూపానికి ప్రత్యేకత, శక్తి, గుణగణాలు ఉంటాయి. భక్తులు తమ కోరికలు, అవసరాల ప్రకారంగా ఈ రూపాల్లో గణపతిని ఆరాధిస్తారు.