దీపారాధన
శ్లో॥ భో దీపదేవి రూపస్త్వం కర్మసాక్షిః అవిఘ్నకృత్ యావత్పూజాం కరిష్యామి తావత్త్వం సిద్ధిదో భవ॥ దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు.
శ్లో॥ భో దీపదేవి రూపస్త్వం కర్మసాక్షిః అవిఘ్నకృత్
యావత్పూజాం కరిష్యామి తావత్త్వం సిద్ధిదో భవ॥
దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు.
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని 3 సార్లు జలం తాగాలి). ఓం గోవిందాయ నమః (ఒకసారి నీటిని పళ్లెంలో వదలాలి), ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః (అనుకుని కొద్దిగా నీళ్లు తలపై చల్లుకోవాలి)
శ్లో॥ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః
(ఈ మంత్రం చదివి చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని కింది మంత్రాన్ని పఠించాలి)
ప్రాణాయామం
శ్లో॥ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు (కుడివైపు)
చల్లుకొని ఈ మంత్రం చదవాలి.
ఓం భూః ఓం భువః ఓగ్ం
సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
సంకల్పం
.. చేతిలో అక్షతలు తీసుకొని సంకల్పం చెప్పాలి
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశోభనే ముహూర్తే శ్రీమహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతఖండే, భరత వర్షే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే, స్వగృహే (సొంతిల్లు కానివారు లక్ష్మీ నివాస గృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షరుతౌ, భాద్రపదమాసే, శుక్ల పక్షే చతుర్థ్యాం తిథౌ, ఇందు వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః ……. గోత్రః (ఎవరికి వారు గోత్రం చెప్పుకోవాలి) …… నామధేయః (కుటుంబ పెద్దపేరు మాత్రం చెబితే చాలు) …… గోత్రోద్భవస్య (గోత్రం) …… నామధేయస్య (వినాయక వ్రతంలో పాల్గొంటున్నవారితోపాటు కుటుంబసభ్యులు అందరి పేర్లనూ చెప్పుకోవచ్చు) ధర్మపత్నీ సమేతస్య (వివాహం అయినవారు మాత్రమే చదవాలి) మమ సహకుటుంబస్య, సబాంధవస్య క్షేమ ైస్థెర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవతా ముద్దిశ్య, వర్షేవర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి
ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే..
(అంటూ అక్షతలు, నీళ్లు పళ్లెంలో వదలాలి)
కలశారాధన
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే ఒక చెంబును తీసుకుని దానికి పసుపు రాసి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత ఆ పాత్రలో తమలపాకు, అక్షతలు వేసి ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి ఈ శ్లోకాన్ని చెప్పాలి.
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతా
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా
రుగ్వేదోథ యజుర్వేదో సామవేదో అధర్వణః
అంగైశ్చసహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశంలోని నీటిని తమలపాకుతో తిప్పుతూ
ఈ కింది శ్లోకాన్ని పఠించాలి)
గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
(కలశంలోని నీటిని తమలపాకుతో వినాయకుడి మీద, పూజా ద్రవ్యాల పైన, పూజలో కూర్చున్నవారిపై, కుటుంబ సభ్యులపై చిలకరించాలి)
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ॥
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః
ధూపమాఘ్రాపయామి
దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః
దీపం దర్శయామి
నైవేద్యం
ఉండ్రాళ్లు, కొబ్బరికాయ వంటి మహానైవేద్యం చూపించాలి.
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
నైవేద్యంపై పుష్పంతో నీళ్లు చిలకరించాలి.
ఓం సత్యంత్వర్తేన పరిషంచామి (నైవేద్యం చుట్టూ నీళ్లు చల్లాలి) ఓం అమృతమస్తు (స్వామివారి దగ్గర నీళ్లు చల్లాలి) ఓం అమృతోపస్తరణమసి అని నైవేద్యం చుట్టూ మళ్లీ నీళ్లు చల్లి ఎడమ చేతితో కుడిచేతిని పట్టుకుని కింది శ్లోకాన్ని, మంత్రాలను చదువుతూ కుడిచేతితో అయిదుసార్లు నైవేద్యాన్ని స్వామివారికి చూపించాలి.
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా.. మధ్యేమధ్యే పానీయం సమర్పయామి (నీళ్లు సమర్పించాలి)అమృతాపిథానమసి. ఉత్తరాపోశనం సమర్పయామి (నీళ్లు చిలకరించాలి) హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ
నీళ్లు చల్లాలి.
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః తాంబూలం సమర్పయామి
పుష్పం
సుగంధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
ఓం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః సువర్ణ పుష్పం సమర్పయామి
నీరాజనం
సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః
యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రయాముకే
తయామాసగ్ం సృజామసి సంతత
శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు
శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః నీరాజనం సమర్పయామి
పుష్పంతో హారతి పళ్లెంపై నీళ్లు చల్లి హారతిని అందరూ కండ్లకు
అద్దుకోవాలి. నీరాజనం అనంతరం… శుద్ధ ఆచమనీయం
సమర్పయామి. స్వామివారిపై పువ్వుతో నీళ్లు చిలకరించాలి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

