Diwali special | ఇంట్లో దక్షిణం వైపు దీపం ఎందుకు పెడతారు?
Diwali special | దీపావళి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పండుగ. మరికొన్ని చోట్ల ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు.
Diwali special | దీపావళి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పండుగ. మరికొన్ని చోట్ల ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు. ధన త్రయోదశి నాడు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని, వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని చెబుతారు. దీనిని యమ దీపం అంటారు. ఈ దీపారాధన చేసిన వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. తల్లిదండ్రులు గతించిన వారు మాత్రమే యమ దీపం పెడుతుంటారు.
నరక చతుర్దశి నాడు ఆడపిల్లలు ఇంట్లో వారికి హారతులు ఇవ్వడం సంప్రదాయం. అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. సాగర మథనంలో లక్ష్మీదేవి ఇదే రోజు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మీదేవి పూజలు చేస్తారు. అమావాస్య మర్నాడు కొన్ని ప్రాంతాల్లో బలి పాడ్యమిగా చేసుకుంటారు. విదియ నాడు యమ ద్వితీయగా చేసుకుంటారు. ఆనాడు అన్నాదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల చేతి వంట తినాలనే నియమం ఉంది. ఏడాదికి ఒకసారైనా సోదరి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు విచారించాలని ఈ పండుగ తెలియజేస్తుంది.
Read More :
“Ravana | రావణుడికి పది తలలు ఎలా వచ్చాయి?”
“ఎడారి ఓడ ఒంటె.. హనుమంతుడి వాహనం ఎలా అయ్యింది?”
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

