Ugadi Panchangam 2022 | ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తే కలిగే లాభాలివే..
Ugadi Panchangam 2022 | ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం అనూచానంగా వస్తున్న కార్యక్రమం. గుళ్లలో సామూహిక పంచాంగ శ్రవణం ఎంతో సందడిగా జరిగే వేడుక. ఆదాయం-ఖర్చు, రాజపూజ్యం-అవమానం, రుతువులు, అనుకూలమైన పంటలు, పశు సంరక్షణ.. తదితర వివరాలు పంచాంగ శ్రవణంలో ప్రధాన అంశాలు. శుభకృత్ సంవత్సర ఉగాది సందర్భంగా పంచాంగం మౌలిక విషయాలను తెలుసుకుందాం.
శ్రీకల్యాణ గుణావహం రిపుహరం దుస్సప్న దోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం
ఆయుర్వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం
నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం
ఉగాది రోజున పంచాంగ శ్రవణం వల్ల కలిగే ఫలితాలను ఈ శ్లోకం వివరిస్తుంది. పంచాంగం వినడం వల్ల మంచిగుణాలు సిద్ధిస్తాయి. శత్రు నాశనం జరుగుతుంది. చెడుకలల దోషం తొలగిపోతుంది. గంగా స్నానం అంత విశేష ఫలం లభిస్తుంది. గోదానం చేస్తే వచ్చే ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది. ఉత్తమమైనది. శుభాలను ఇచ్చేది. సంతాన సంపదను అనుగ్రహిస్తుంది. అనేక కార్యాలను సుసాధ్యం చేస్తుంది. కాబట్టి, పంచాంగం వినడం సముచితం. పంచాంగం ఐదు అంగాల సమాహారం..
ఐదు అంగాలు
తిథి: రెండు చంద్రోదయాల మధ్య కాలమే తిథి. అంటే చంద్రుణ్ని అనుసరించి ఏర్పాటు చేసుకున్న దినమే తిథి. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య తిథులు.
వారం: ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. సూర్యోదయం నుంచి మళ్లీ సూర్యోదయం మధ్య కాలం ఆధారంగా వారాలను నిర్ణయించారు.
నక్షత్రం: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి… రేవతి మొదలైన 27 నక్షత్రాలు. వీటిని చంద్రుడి గమనం ఆధారంగా నిర్ణయిస్తారు.
యోగం: శుభ సమయాలు. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్… మొత్తం 27 యోగాలు ఉంటాయి. ఒక్కో యోగానికి ఒక్కో అభిమాన దేవత ఉంటాడు. శుభ సమయాలను యోగంగా పిలిచినప్పటికీ విష్కంభం, అతిగండ, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వ్యతీపాత, పరిఘ, వైధ్రుతి యోగాలను మాత్రం శుభమైనవిగా పరిగణించరు.
కరణం: అంటే తిథిలో సగం. రెండు కరణాలు కలిస్తే ఒక తిథి అవుతుంది. కింస్తుఘ్న, భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణిక్, భద్ర, శకుని, చతుష్పాద, నాగవ అని కరణాలు మొత్తం 11. వీటిని శివుడి వివిధ రూపాలతో ముడిపెడతారు.
Read More :
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?
కర్మ ఫలం అంటే ఏంటి? ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో అనుభవించాల్సిందేనా?
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

