TTD | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. రేపు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఆగస్ట్‌కు సంబంధించిన అంగప్రక్షిణం టోకెన్లను బుధవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల్లో 750 టోకెన్ల చొప్పున కేటాయించనున్నది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.
అంగప్రదక్షిణం అంటే ఏంటీ?
అంగప్రదక్షిణం స్వామివారికి ఎంతో ప్రీతికరమైంది. దీంతో భక్తిభావంతో భక్తులు స్వామివారి కటాక్షం కోసం పొర్లుదండాలు పెడుతుంటారు. అంగప్రదక్షిణం టోకెన్లు ఉన్న భక్తులు ప్రతిరోజు వేకువజామున ముందుగా శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానం చేసి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత వెండి వాలికిలో నుంచి బంగారు వాకిలికి చేరుకుంటారు.
వెండి వాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణనే అంగప్రదక్షిణంగా పిలుస్తుంటారు. ఓ వైపు సుప్రభాత సేవ జరిగే సమయంలోనే టీటీడీ భక్తులకు అంగప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తుంది. భక్తులు వెండి వాకిలి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఆదిశేషునిపై శ్రీరంగనాథుడు కొలువై కనిపిస్తాడు. ఆయనకుపైన వరదరాజ స్వామి, కింద వేంకటేశ్వరస్వామి చిత్రాలు చిన్న బంగారు ఫలకాలపై ఉంటాయి. ఇక్కడి నుంచి అంగప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆనంద నిలయం చుట్టూ ఒకసారి అంగప్రదక్షిణం చేసిన తర్వాత భక్తులకు టీటీడీ శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తుంది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

