దారమొక్కటే!
ఊరి గుట్ట మీదకు ఒక ఆధ్యాత్మిక గురువు వస్తున్నాడని తెలిసింది. గ్రామస్తులు గురువును సముచితంగా గౌరవించి ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. గురువుకు సమర్పించడానికి ఎవరికి తగిన కానుకలు వారు సిద్ధం చేసుకున్నారు. కొందరు రైతులు ధాన్యం, పండ్లు, కొబ్బరి కాయలు, నెయ్యిలాంటివి కూడా సేకరించి పెట్టుకున్నారు.
- కథాసుధ
ఊరి గుట్ట మీదకు ఒక ఆధ్యాత్మిక గురువు వస్తున్నాడని తెలిసింది. గ్రామస్తులు గురువును సముచితంగా గౌరవించి ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. గురువుకు సమర్పించడానికి ఎవరికి తగిన కానుకలు వారు సిద్ధం చేసుకున్నారు. కొందరు రైతులు ధాన్యం, పండ్లు, కొబ్బరి కాయలు, నెయ్యిలాంటివి కూడా సేకరించి పెట్టుకున్నారు. ఆ ఊరిలోని మగ్గంపై బట్టలు నేసే నేతగాడికి ఆ విషయం తెలిసింది. నాకు దుస్తులు నేసే పని తప్పితే మరేదీ రాదు కదా, గురువుకు నేనేమి ఇవ్వగలనని భార్యతో చెప్పి బాధపడ్డాడు. మనం ఒక వస్త్రం నేసి బహుమతిగా ఇద్దామని చెప్పింది. భార్య సలహాకి ఎంతో సంతోషించాడు. వెంటనే పని ప్రారంభించాడు. పనిలో పనిగా తనకు కూడా వస్ర్తాన్ని తయారు చేసుకోవాలనుకున్నాడు. ఆధ్యాత్మిక గురువుకిచ్చే వస్ర్తానికి మంచి రకం దారం, తన వస్ర్తానికి నాసిరకం దారం వాడాలనుకున్నాడు. అలాగే చేశాడు.
గురువు ఆ రోజు రాత్రి గుట్ట మీదకు వచ్చాడు. నేతగాడు భార్యతో కలిసి గురువు వద్దకు వెళ్లే హడావుడిలో తనకోసం తయారు చేసుకున్న నాసిరకం వస్త్రం తీసుకెళ్ళాడు. గురువు ఆశీర్వాదం తీసుకునే సమయంలో తను చేసిన పొరపాటు గుర్తించాడు. భార్యతో ఆ విషయం చెప్పి బాధపడ్డాడు. రాత్రి సమయం కావడంతోనూ, ఇల్లు చాలా దూరంలో ఉండటంతోనూ ఏమి చేయాలో పాలు పోలేదు. తన చేతిలోని వస్ర్తాన్ని గురువుకు సమర్పించడానికి తటపటాయించ సాగాడు. అతడి తడబాటును గ్రహించిన గురువు.. ‘కారణమేమిట’ని అడిగాడు. విషయం చెప్పాడు నేతగాడు. గురువు నవ్వి ‘ఇంత చిన్న విషయానికి బాధపడాలా? ప్రేమ పూర్వకంగా నన్ను కలవడానికి వచ్చారు. అదే చాలు. కానుకల పట్ల నాకు ఆసక్తి లేదు. అయినా నా కోసం చేసిన వస్ర్తాన్ని దేనితో చేశావు?’ అని అడిగాడు. దారమని సమాధానమిచ్చాడు నేతగాడు. నీకోసం చేసిన వస్ర్తాన్ని దేనితో చేశావని ప్రశ్నించాడు. ‘అది కూడా దారంతోనే’ అని సమాధానమిచ్చాడు. గురువు నవ్వి పశువుల రంగులు వేరుగా ఉన్నా, పాల రంగు ఒక్కటే. మతాలు వేరైనా ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే. వస్త్ర భేదం వేరైనా దారమొక్కటే కదా అన్నాడు. నేతగాడి దంపతులు గురువు మాటల్లోని ఆంతర్యం తెలుసుకున్నారు. గురువుకు వస్ర్తాన్ని సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆర్సీ కృష్ణస్వామి రాజు
93936 62821
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

