Cannes Film Festival | ప్రపంచ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival 2026) ఘనంగా ముగిసింది. ప్రముఖ సౌత్ కొరియన్ దర్శకుడు పార్క్ చాన్-వుక్ నేతృత్వంలోని జ్యూరీ సభ్యులు ఈ ఏడాది విజేతలను అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ అంతర్జాతీయ వేడుకల్లోని ప్రధాన కేటగిరీల విజేతల పూర్తి జాబితా చూసుకుంటే!
ప్రధాన అవార్డుల విభాగం
పామ్ డి ఓర్ (స్వర్ణ కమలం) (ఉత్తమ చిత్రం): ఫియార్డ్
దర్శకత్వం: క్రిస్టియన్ ముంగియు (రోమేనియా దేశానికి చెందిన ఈ దర్శకుడికి ఇది రెండవసారి ఈ అత్యున్నత పురస్కారం దక్కడం విశేషం).
ప్రధాన నటీనటులు: సెబాస్టియన్ స్టాన్, రెనేట్ రీన్స్వే.
ద్వితీయ అత్యున్నత పురస్కారం: మినోటార్
దర్శకత్వం: ఆండ్రీ జ్వ్యాగింట్సేవ్
ప్రత్యేక జ్యూరీ పురస్కారం: ది డ్రీమ్డ్ అడ్వెంచర్
దర్శకత్వం: వాలెస్కా గ్రిస్బాక్
ఉత్తమ దర్శకుడు (ఇద్దరు విజేతలు):
పావెల్ పావ్లికోవ్స్కీ (చిత్రం: ఫాదర్ల్యాండ్)
జావియర్ కాల్వో మరియు జావియర్ ఆంబ్రోసి (చిత్రం: లా బోలా నెగ్రా)
ఉత్తమ నటి (సంయుక్తంగా):
వర్జీనియా ఎఫిరా మరియు టావ్ ఒకమోటో (చిత్రం: ఆల్ ఆఫ్ ఎ సడన్)
ఉత్తమ నటుడు (సంయుక్తంగా):
ఇమ్మాన్యుయేల్ మచ్చియా మరియు వాలెంటిన్ కాంపేన్ (చిత్రం: కవార్డ్)
ఉత్తమ కథా గమనం (స్క్రీన్‌ప్లే): ఎ మ్యాన్ ఆఫ్ హిస్ టై
రచయిత/దర్శకత్వం: ఇమ్మాన్యుయేల్ మార్రే
ఈ 79వ కేన్స్ వేడుకల్లో తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై భారతీయ చేనేత వస్త్రాలు, హైదరాబాద్ ముత్యాల హారంతో మెరిసి, ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు మన తెలుగు సంస్కృతిని, చేనేత కళను చాటిచెప్పారు.

Rashmi Thakur