సర్వ సంపూర్ణతా సిద్ధికి ఓం శ్రీం శ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా

వందే నవ ఘనశ్యామం
పీత కౌశేయ వాసనమ్
సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరమ్
భారతీయ జీవనానికి ఒక పథ నిర్దేశకుడు గోపాలుడు. శ్రీకృష్ణ తత్త్వం బహుముఖీనమైనది. ఆయన అవతార రహస్యాలు ఎన్నో. కృష్ణుడంటేనే ఒక ఆకర్షణ. ఇదే ఈ ప్రకృతి సూత్రం. ఇదే విశ్వం నిండా నిండి ఉన్న తత్త్వం. ఆ తత్వానికి ఒక రూపం ఇస్తే ఆ రూపమే శ్రీకృష్ణుడు. పుట్టి పెరిగిన విధానం, రూపు రేఖలు, చేష్టలు, విలాసాలు, రాజకీయాలు అన్నిటిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయా అంశాలను కూలంకషంగా చూస్తే ఈ విశ్వ రహస్యాలు, ప్రకృతి రహస్యాలు ఎన్నో దాగి ఉంటాయి.
కృష్ణుడు గురువు, శిష్ట రక్షకుడు, సమయోచితమైన ధర్మాన్ని తెలిపేవాడు, చక్కని చమత్కారమైన వాక్కు కలిగిన వాడు, అందరిపై సమానమైన ప్రేమ కలిగినవాడు, ప్రేమమయుడు, ఆకర్షణ కలిగినవాడు, దుష్ట శిక్షకుడు, జ్ఞాని, యోధుడు, యోగి.. ఇలా పరమాత్మ ఎన్ని రూపాల్లో మనని అనుగ్రహించాలో అన్ని రకాలైన లక్షణాలను కలిగినవాడు శ్రీకృష్ణుడు. అటువంటి పరిపూర్ణుని ధ్యానం వల్ల మనకు కూడా పూర్ణత్వం సిద్ధిస్తుంది. మనలోనూ అలాంటి గుణాలు వృద్ధి పొందుతాయి. ఆయనను శరణు వేడడానికి ఎన్నో మంత్రాలున్నా “ఓం శ్రీం శ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా” అనే మంత్రంతో జపించడం వల్ల సర్వ సంకటాల నివారణతోపాటు పూర్ణత్వ సిద్ధి కలుగుతుంది.
సాగి కమలాకరశర్మ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- little krishna
- srikrishna
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

