శ్రీ దుర్గాదేవి అలంకారంలో విజయవాడ కనకదుర్గ
Durga Devi | విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం.. అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో
అమరావతి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం.. అమ్మవారు శ్రీ దుర్గాదేవి (Durga Devi) అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. త్రిశూలం ధరించి సింహవాహనాన్ని అధిష్ఠించి, బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ దర్శనమిస్తారు. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుణ్ణి వధించి దుర్గాదేవి స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతున్నది.
దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనార్ధం భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి వండే కదంబం ను అమ్మవారిని నివేదనచేస్తారు. కాగా, అమ్మవారు ఆదివారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొమ్మిదో రోజైన రేపు (మంగళవారం) శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా కనిపించనున్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

