ఖురాన్ హెచ్చరికలు!
జీవితంలో ప్రశాంతత కావాలన్నా, మార్గం తోచని వేళ జవాబు కావాలన్నా మనం పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను తెరుస్తాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి! ఖురాన్ కేవలం మన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇవ్వడం లేదు... అది మనల్ని హెచ్చరిస్తున్నది! మన ప్రవర్తనను, మన ప్రాధాన్యాలను, సమాజంలో తోటి మనుషులతో మనం నడుచుకుంటున్న తీరును ఒక్కసారి అద్దంలో చూసుకోమని గట్టిగా ప్రశ్నిస్తున్నది.
జీవితంలో ప్రశాంతత కావాలన్నా, మార్గం తోచని వేళ జవాబు కావాలన్నా మనం పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను తెరుస్తాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి! ఖురాన్ కేవలం మన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇవ్వడం లేదు… అది మనల్ని హెచ్చరిస్తున్నది! మన ప్రవర్తనను, మన ప్రాధాన్యాలను, సమాజంలో తోటి మనుషులతో మనం నడుచుకుంటున్న తీరును ఒక్కసారి అద్దంలో చూసుకోమని గట్టిగా ప్రశ్నిస్తున్నది.
- ‘మీకు, మీ తల్లిదండ్రులకు లేదా సమీప బంధువులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మీరు న్యాయం వైపే దృఢంగా నిలబడండి’ (ఖురాన్ 4:135). ఇంతటితో ఆగలేదు, ‘(ఏదైనా) వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనై న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చెయ్యండి’ అని వక్కాణించింది.
- ‘ప్రజలను దెప్పి పొడవటంలో, పరోక్షంగా వారి లోపాలను ఎంచటంలో ఆసక్తి కనబరచేవాడూ, ధనాన్ని కూడబెట్టిన దానిని మాటిమాటికి లెక్కబెట్టి ఉంచేవాడూ అయిన ప్రతి వ్యక్తీ సర్వనాశనమవుతాడు’ (ఖురాన్ 104:1-2).
- ఒక వ్యక్తి మన ఎదుట లేనప్పుడు, అతనికి నచ్చని విషయాన్ని అతని గురించి మాట్లాడటమే పరోక్ష నింద (గీబత్) అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్వచించారు. ఆ చెప్పేది నిజమైనా సరే అది గీబత్ కిందకే వస్తుంది! ఒకవేళ అది అబద్ధమైతే, అది నిందారోపణ అవుతుంది (సహీహ్ ముస్లిం 2589).
- ‘మనుషులు తమ స్వహస్తాలతో చేసుకున్న దాని వల్ల నేలపైనా, సముద్రంలోనూ అలజడి/అవినీతి వ్యాపించింది’ (ఖురాన్ 30:41). మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఎలా కాపాడుకుంటున్నాం అనే అంశాలపై మన భక్తి, మన విశ్వాసం ప్రతిబింబించాలి అని చెబుతుంది ఖురాన్.
- అనాథలను, పేదలను, అవసరంలో ఉన్న బలహీనులను గుండెల్లో పెట్టుకుని ఆదుకోవాలని ఖురాన్ పదే పదే నొక్కి చెబుతుంది. ప్రశంసల కోసమో, ప్రతిఫలం ఆశించి చేసేది నిజమైన దానం కాదు. అల్లాహ్ సర్వాంతర్యామి, ఆయన నన్ను చూస్తున్నాడనే అంతర్గత భయభక్తులతో మాత్రమే చేసేది నిజమైన దానం.
ముహమ్మద్ ముజాహిద్, 96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

