Rakhi Pournami | రాఖీ పౌర్ణమి.. అనుబంధాలను పెంపు చేస్తూ.. బాధ్యతలను గుర్తు చేసే వేడుక
శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంది.
Rakhi Pournami | శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంది. ఈ సమరంలో దేవతల గెలుపు కోరి శ్రావణ పౌర్ణమినాడు లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి.. శచీదేవి తన భర్త దేవేంద్రుడికి రాఖీ కడుతుంది. ఆ రక్ష ప్రభావంతో ఇంద్రుడు యుద్ధంలో గెలుస్తాడు. ద్వాపర యుగంలో ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపదీదేవి తన చీర చెంగును చింపి రక్ష కడుతుంది. ఆ రక్షే తర్వాత వస్ర్తాపహరణ ఘట్టంలో ద్రౌపదికి రక్షణగా నిలిచిందన్న కథ కూడా ప్రచారంలో ఉంది.
ఇక చారిత్రక అంశాలను పరిశీలిస్తే.. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ భార్య రుక్సానా తన భర్త మేలు కోరి భారత ఉపఖండం వాయవ్య భాగాన్ని పాలిస్తున్న రాజు పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. సోదరి సౌభాగ్యం కోరి పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను ప్రాణాలతో విడిచిపెట్టాడని చెబుతారు. ఇలా రక్షాబంధనం వెనుక అనేకానేక కథలు ప్రచారంలో ఉన్నాయి. లౌకికంగా ఆలోచిస్తే.. సోదరి, సోదరులు ఒకరి మేలు మరొకరు కోరుకునే సందర్భం ఇది. తమకు అండగా సోదరులు ఉన్నారన్న ధీమా ఆడపిల్లలకు కలిగించే పండుగ రాఖీ పౌర్ణమి. తోడబుట్టిన వారికన్నా ఆత్మీయులు మరెవరూ ఉండరన్న సత్యాన్ని బోధించే పండుగ ఇది. అనుబంధాలను పెంపు చేస్తూ, బాధ్యతలను గుర్తు చేసే వేడుక రాఖీ పౌర్ణమి.
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభిబధ్నామి రక్షే మా చలమాచల॥
‘ఎంతో బలవంతుడైన బలి చక్రవర్తినే బంధించిన విష్ణుశక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను. దీని శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లుతూ ఉండాలి’ అని పై శ్లోకానికి అర్థం. బలి చక్రవర్తిపై అభిమానంతో విష్ణుమూర్తి అతని దగ్గరే చిక్కుకుపోతాడు. శ్రీహరిని విడిపించడానికి బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాబంధనం కట్టిందని భవిష్య పురాణం చెబుతున్నది. ఈ శ్లోకం చదువుతూ సోదరులకు రాఖీ కట్టాలని పెద్దల మాట.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

