Holi | హోలీ రోజు రంగులు ఎందుకు చల్లుకుంటారో తెలుసా?
హోలికి మరోపేరు వసంతకేళి. వసంతం అంటే పలురంగుల కలయిక. సున్నం పసుపు కలిపితే ఎరుపు తయారయ్యే పద్ధతిని వసంతం అంటారు.
Holi | హోలికి మరోపేరు వసంతకేళి. వసంతం అంటే పలురంగుల కలయిక. సున్నం పసుపు కలిపితే ఎరుపు తయారయ్యే పద్ధతిని వసంతం అంటారు. హోలీ సందర్భంగా రంగులు చల్లుకోవడమనే సంప్రదాయం గురించి తాత్త్వికంగా విచారిస్తే మానవ జీవితం సప్తవర్ణ సమన్వితం. ఒక్కో రంగు ఒక్కో భావానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవ చేతనలో ఆలోచనలపై రంగులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.
- ఎరుపు అన్ని వర్ణాల కన్నా ఎక్కువగా ఉత్తేజాన్నిస్తుంది. ఉత్సాహభరితమైనది ఏదైనా ఎరుపు రంగులో ఉంటుంది.
- మన అవగాహనకు మించినది ఏదైనా, సాధారణంగా నీలం రంగులో ఉంటుంది. అది సముద్రం అయినా, ఆకాశం అయినా సరే.
- ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తులు నారింజ రంగును ఎంచుకుంటారు. యోగసాధనలో ఆజ్ఞా చక్రం కదులుతున్నప్పుడు, అది నారింజ రంగులో ఉంటుంది.
- శరీరంలో అత్యంత ప్రాథమిక చక్రమైన మూలాధారం వర్ణం పసుపు.
- పసుపు-నీలం నుంచి జనించేది ఆకుపచ్చ. హరిత వర్ణం ప్రశాంతమైన మనసుతో స్పష్టతను అందిస్తుంది. పచ్చ.. వృద్ధి, పునరుద్ధరణ, శాంతిని తెలియజేస్తుంది.
- తెలుపు నుంచే అన్ని రంగులూ ఉద్భవిస్తాయి. తెలుపు పవిత్రతను, శాంతిని, స్వచ్ఛతను తెలుపుతుంది.
…? శ్రీ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

