కొనే బంగారం కాదు.. చేసే దానం అక్షయం
వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ‘మహాభారతం’లో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందనీ కొందరి విశ్వాసం.
వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ‘మహాభారతం’లో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందనీ కొందరి విశ్వాసం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అక్షయమైన సంపదలు కలుగుతాయన్న విశ్వాసం ఉంది. అయితే, దీనికి శాస్త్ర ప్రమాణం కనిపించదు. ఈరోజు చేసే పుణ్యకార్యాలు, జపతపాలు, దానధర్మాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్ర వచనం. దానాలలో స్వర్ణదానం శ్రేష్ఠమైనదని చెబుతారు.
అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దానమివ్వాలే కానీ, కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే! పార్వతీదేవికి అక్షయ తృతీయ ప్రత్యేకతను వివరించిన పరమేశ్వరుడు ‘ఈ పర్వదినం నాడు అక్షయ స్వరూపుడైన దైవాన్ని ఆరాధిస్తే అనంతమైన అనుగ్రహం కలుగుతుంద’ని వివరించాడట. పరమ పవిత్రమైన గంగానది దివినుంచి భువికి దిగివచ్చిన రోజు ఇదేనని పురాణ కథనం.
అంతేకాదు, కుచేలుడు శ్రీకృష్ణ దర్శనంతో అక్షయమైన సంపదలు పొందిన రోజు ఇదేనని కొందరి భావన. ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి, ఆమె దాన గుణాన్ని గుర్తించి ఆదిశంకరులు అమ్మవారిని ‘కనకధారా స్తోత్రం’తో ప్రార్థించి ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే అని చెబుతారు. ఈ రోజు ఆచరించే మంచి పనులు ఏవిధంగా అయితే ఉత్తమ ఫలితాలను ఇస్తాయో, దుష్కార్యాలు చేస్తే వాటి ప్రభావం కూడా అక్షయంగా వెంటాడుతుందని పెద్దల మాట. అందుకే, ఉన్నంతలో పేదలకు దానం ఇవ్వడం, భగవన్నామ స్మరణ వల్ల దైవానుగ్రహం అనంతంగా పొందగలుగుతాం.
– భార్గవ్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

