Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Gold Locket | జైపూర్ కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు తిరుమల శ్రీవారికి శనివారం రూ.51.55 లక్షలు విలువైన 174 గ్రాముల బంగారు లాకెట్ , ముత్యాల హారాన్ని విరాళంగా అందించారు.
తిరుమల : జైపూర్ కు చెందిన ఆర్తి బిందాల్ (Aarti Bindal ) దంపతులు తిరుమల శ్రీవారికి శనివారం రూ.51.55 లక్షలు విలువైన 174 గ్రాముల బంగారు లాకెట్ ( Gold Locket ) , ముత్యాల హారాన్ని ( Pearl necklace) విరాళంగా అందించారు. వీటిలో రూ.44.35 లక్షలు విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్, రూ.7.20 లక్షలు విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల మూడు వరుసల ముత్యాల హారాలు ఉన్నాయి. ఈ మేరకు దాత తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు ఆభరణాలను అందజేశారు.

Gold Locket Ttd
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుపతికి చెందిన విష్ణు ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ వైద్యశాలలకు రూ.18 లక్షల విలువైన ఔషధాల విరాళం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ కు చెందిన ఎస్ఎస్కే ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రొప్రైటర్ జి. శ్రవణ్ కుమార్ రూ.15 లక్షల విలువైన ఔషధాలను, ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తలశిల వెంకటేశ్వరరావు రూ.3 లక్షల విలువైన ఔషధాలను శనివారం విరాళంగా అందించారు. టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శనివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బి.ఆర్. నాయుడును కలిసి దాతల తరఫున ఔషధాలను అందజేశారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

