TTD Chairman | తిరుమలలో వారిని అసలే నమ్మవద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి
TTD Chairman | కలియుగ దైవం శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోసం దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం భక్తులకు విజ్ఞప్తి చేశారు.
తిరుమల : కలియుగ దైవం శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోసం దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ చైర్మన్ (TTD Chairman ) బీఆర్ నాయుడు ( BR Naidyu ) శనివారం భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో కొందరు దళారులు , మధ్యవర్తులు ( Middlemen ) శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను పలు మార్గాల ద్వారా మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ముఖ్యంగా టీటీడీలోను, ప్రభావిత స్థానాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులమని కొందరు మాయమాటలతో మెరుగైన శ్రీవారి బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కల్పిస్తామని ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. ఇలాంటి నకిలీ వ్యక్తులు భక్తుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి మోసం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. ఇప్పటికే భక్తులను మోసం చేస్తున్న దళారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భక్తులు టీటీడీ సేవలకు సంబంధించి https://ttdevasthanams.ap.gov.in , ttdevasthanams మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్లో తమ ఆధార్ కార్డు ఆధారంగా బుక్ చేసుకోవాలని కోరారు. టీటీడీ సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించాలని సూచించారు. దళారులపై అనుమానం వస్తే టీటీడీ విజిలెన్స్ అధికారులు 0877-2263828 సదరు ఫోన్ నెంబర్ లో నిరంతరం అందుబాటులో ఉంటారని, ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

