అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ (18-14)
‘ఏదైనా సాధించాలంటే ముందుగా శరీరం బాగుండాలి. శరీరంలోని ఆత్మ (విశ్వాసం) పరిపూర్ణంగా ఉండాలి. ఇంద్రియాలు బాగా పనిచేయాలి. ఒక ప్రయత్నం చేసి ఊరుకోకూడదు. వివిధ మార్గాల్లో ప్రయత్నించాలి. ఇవన్నీ చేసినవారిని దైవం అనుకూలిస్తుంది అన్నాడు’ గీతాచార్యుడు. ఇందులోని సూక్ష్మం గ్రహిస్తే అది చదువులో కావొచ్చు, ఉద్యోగంలో కావొచ్చు, జీవితంలో కావొచ్చు.. అనుకున్న లక్ష్యం అందుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుందని నమ్మి అలుపెరగని పోరాటం చేయాలి. అప్పుడు విజయం తప్పకుండా వరిస్తుంది.