పరిపూర్ణ శ్వాసకు సుదర్శన క్రియ
ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అందరి జీవితాల్లోనూ సమస్యలు, ఒత్తిళ్లు, ఆందోళనలు సహజం. వాటిని ఎదుర్కొని, జయించి ముందుకుసాగడం ఎలాగో తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు. చిన్నప్పుడు బడిలో,
ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అందరి జీవితాల్లోనూ సమస్యలు, ఒత్తిళ్లు, ఆందోళనలు సహజం. వాటిని ఎదుర్కొని, జయించి ముందుకుసాగడం ఎలాగో తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు. చిన్నప్పుడు బడిలో, పెద్దయ్యాక కాలేజీలో ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఉపాధికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. కానీ, మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో, ఒత్తిడిని ఎలా పోగొట్టుకోవాలో, ఆనందంగా ఉండటం ఎలా సాధ్యమో మనకు ఎవరూ నేర్పరు. దాంతో జీవితం అనే ప్రయాణాన్ని ఒక కళగా, ఆనందభరితంగా ఎలా మలచుకోవాలో మనకు తెలియదు.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, భావావేశాల ప్రభావం నుంచి మనసును అదుపులో ఉంచుకోవాలనే విషయాన్ని మొట్టమొదట గుర్తించింది మన భారతీయ యోగశాస్త్రమే. ‘యోగః చిత్తవృత్తి నిరోధః’ అని పతంజలి మహర్షి ఉవాచ. సుమారు ఐదు వేల ఏండ్ల కిందటనే విషయాన్ని కనుగొన్న ఈ విజ్ఞానం ఆధారంగా ఒక పరిపూర్ణమైన శ్వాస ప్రక్రియను ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ ఆవిష్కరించి మనకు అందించింది. అదే సుదర్శన క్రియ.
మన ఆరోగ్యం, జీవనశైలి, ఆయుర్దాయం ఇవన్నీ మన మానసిక స్థితి, భావావేశాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయని అనేక శాస్త్రీయ పరిశోధనలు సూచిస్తున్నాయి. శరీరానికి, మనసుకు ఉన్న సంబంధంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవన్నీ మన ఆలోచనలు, భావావేశాలు మన మెదడును, హార్మోన్ల పనితీరును, రోగ నిరోధకవ్యవస్థ పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తున్నాయి. మనసులో కలిగే భావావేశాలకు అనుగుణంగా మన శరీరంలో న్యూరో పెప్టయిడ్లు అని పిలిచే రసాయన వాహకాలు విడుదలవుతాయి.
అవి చేరవేసే సమాచారాన్ని రోగ నిరోధక వ్యవస్థ, నాడీవ్యవస్థ, జీర్ణవ్యవస్థ మొదలైనవి అందిపుచ్చుకుంటాయి. ఫలితంగా వాటి పనితీరు ప్రభావితమవుతుంది. ఆనందం, ప్రేమ, ఉత్సాహం మొదలైన సానుకూలమైన భావాలు కలిగినప్పుడు విడుదలయ్యే న్యూరో పెప్టయిడ్లను అందుకున్నప్పుడు మెదడు, నాడీవ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ మొదలైనవి ఆరోగ్యవంతమైన ప్రభావానికి లోనవుతాయి. ఫలితంగా వ్యాధి నిరోధకశక్తి పెరిగి మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి భిన్నంగా కోపం, భయం, విచారం మొదలైన ప్రతికూల భావాలు కలిగినప్పుడు విడుదలయ్యే రసాయనాల కారణంగా మన శరీర వ్యవస్థలు విపరీత ప్రభావాలకు లోనై ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
సుదర్శన క్రియ అనేది ఒక క్రమపద్ధతిలో శ్వాస పీల్చడం ద్వారా ఒత్తిడిని తొలగించి శరీర వ్యవస్థల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా, మన భావావేశాలను నియంత్రించి మానసిక ప్రశాంతతను తీసుకువస్తుంది. ఎలాగైతే మన భావావేశాలు మనం శ్వాసించే విధానాన్ని ప్రభావితం చేస్తాయో అదేవిధంగా మన శ్వాసక్రమాన్ని నియంత్రించడం ద్వారా భావావేశాలను, మానసికస్థితిని మార్చుకోవచ్చు. సుదర్శన క్రియ వల్ల కలిగే లాభాలను అనేక వైద్య పరిశోధనాసంస్థలు స్వతంత్రంగా పరిశీలించి ధ్రువీకరించాయి.
న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) జరిపిన పరిశోధనల్లో, సుదర్శన క్రియ సాధన చేసే వారిలో బీటా, ఆల్ఫా చర్యలు క్రియాశీలమై, తత్ఫలితంగా మానసిక విశ్రాంతి పెరిగినట్లు తేలింది. అంతేకాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి, మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినట్లు నిర్ధారణయింది. సుదర్శన క్రియ సాధన ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ తక్కువగా విడుదల కావడమే అందుకు కారణం. దీనివల్ల రోగ నిరోధకశక్తి పెరిగి, ఆందోళన, కుంగుబాటు నుంచి బయటపడతారు. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి పెరిగి ఆరోగ్యం మెరుగవుతుంది. మెదడు పనితీరు బాగుంటుంది.
సులభమైన శక్తిమంతమైన ఈ శ్వాసప్రక్రియ వల్ల ఎలాంటి దుష్పరిణామాలూ తలెత్తవు. దీన్ని సులభంగా నేర్చుకొని ఇంటిదగ్గరే సాధన చేయవచ్చు. ముళ్లదారిలో నడచివెళ్లాలంటే, దారి పొడవునా కంపలను తొలగించుకుంటూ ప్రయాణం చేయవచ్చు. అది ప్రయాసతో కూడిన పని. ప్రయాణం సాగుతున్న కొద్దీ శ్రమ అధికమవుతుంది. అదే దారిలో కాళ్లకు జోళ్లు తొడుక్కుని వెళ్లవచ్చు. మార్గం మారదు, కానీ ప్రయాణం సౌకర్యవంతంగా, ఆనందభరితంగా సాగుతుంది. అదే జీవన కళ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్.
శ్రీశ్రీ రవిశంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

