అశ్వత్థామ చిరంజీవః
భూమ్మీద సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకడు. మహాభారత ఇతిహాసంలో ఆయన పాత్ర అద్భుతం. వీరుడు, శూరుడు, పుట్టుకతో వరాన్ని పొందిన ధీరుడు.
భూమ్మీద సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకడు. మహాభారత ఇతిహాసంలో ఆయన పాత్ర అద్భుతం. వీరుడు, శూరుడు, పుట్టుకతో వరాన్ని పొందిన ధీరుడు. కౌరవ, పాండవుల గురువు ద్రోణాచార్యుడు, కృపి సంతానం ఈయన. పుట్టే సమయంలో అందరిలా ఏడవకుండా గుర్రంలా సకిలించినందుకు ఈ పేరు పెట్టారని కథ. అశ్వత్థామ శివుడి వరప్రసాదం. పుట్టుకతోనే అతని నుదుటిపై ఓ మణితో జన్మించాడు. అది అతనికి మృత్యువు సహా అన్ని రకాల బాధల నుంచి రక్షణనిస్తుంది. అలా ద్రోణపుత్రుడు చిరంజీవి అయ్యాడు. అశ్వత్థామ తండ్రి శిక్షణలో కౌరవ, పాండవులతోపాటే విద్య నేర్చుకున్నాడు. అర్జునుడికి సాటి వచ్చే విలుకాడిగా రాటుదేలాడు. అర్జునుడితోపాటే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్నీ సాధించాడు. అయితే ఇతనిది దుడుకు స్వభావం. అస్త్ర ప్రయోగం అత్యవసరమైతే తప్ప చేయకూడదన్న తండ్రి మాటలను అశ్వత్థామ చెవికెక్కించుకోలేదు. ఇక దుర్యోధనుడితో స్నేహం చేసిన అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరఫున పోరాటం చేశాడు.
యుద్ధంలో తండ్రి మరణం తట్టుకోలేక పాండవుల మీదికి శక్తిమంతమైన నారాయణాస్ర్తాన్ని ప్రయోగిస్తాడు. అయితే అది ఆయుధాలు ఉన్నవారినే తప్ప నిరాయుధులను దండించదు. శ్రీకృష్ణుడి సలహాతో పాండవ వీరులంతా తమ ఆయుధాలను వదిలేస్తారు. అలా పాండవులు యుద్ధంలో ఓటమిని తప్పించుకుంటారు. ఇక భారత యుద్ధం పూర్తయిన తర్వాత కూడా అశ్వత్థామ తన స్నేహితుడు దుర్యోధనుడి కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఓ రాత్రివేళ పాండవుల శిబిరం మీద దాడిచేస్తాడు. పొరపాటుగా పాండవ పుత్రులైన ఉపపాండవులను సంహరిస్తాడు.
ఉదయం జరిగింది తెలుసుకున్న పాండవులు ఆగ్రహోదగ్రులు అవుతారు. జరిగినదానికి అశ్వత్థామ కారకుడని తెలుసుకుంటారు. అతణ్ని వేదవ్యాసుడి ఆశ్రమంలో పట్టుకుంటారు. అశ్వత్థామ, పాండవులకు మళ్లీ యుద్ధం మొదలవుతుంది. దీంతో అశ్వత్థామ అర్జునుడి కోడలు గర్భిణిగా ఉన్న ఉత్తర మీదికి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. నష్టం జరగకముందే శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుంటాడు. ఉత్తరను కాపాడతాడు. చిరంజీవి అయిన అశ్వత్థామను కుష్ఠువ్యాధితో రోజులు వెళ్లదీయమని శపిస్తాడు. గర్భంలో ఉన్న శిశువును చంపే ప్రయత్నం చేసినందుకు కృష్ణుడి శాపభారాన్ని మోస్తూ అశ్వత్థామ కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఇప్పటికీ జీవించి ఉన్నాడని పురాణ కథనం.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

