కరెంట్ మీటర్ ?
2025 జనవరి నెలలో 20 రోజుల్లోనే వెయ్యి సార్లకుపైగా బద్దలై ఇండోనేసియాలోని ఓ అగ్ని పర్వతం వార్తల్లో నిలిచింది. అది ఏది? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో నడిచే బస్సులు, కార్లు, ఆటోల గురించి తెలిసిందే. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ దేశీయ ద్విచక్ర వాహన సంస్థ సీఎన్జీ స్కూటర్‌ను అందుబాటులోకి ప్రవేశపెట్టనుంది. ఆ కంపెనీ ఏది?
మీ జీకే.. ఓకేనా?
- 2025 జనవరి నెలలో 20 రోజుల్లోనే వెయ్యి సార్లకుపైగా బద్దలై ఇండోనేసియాలోని ఓ అగ్ని పర్వతం వార్తల్లో నిలిచింది. అది ఏది?
- కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో నడిచే బస్సులు, కార్లు, ఆటోల గురించి తెలిసిందే. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ దేశీయ ద్విచక్ర వాహన సంస్థ సీఎన్జీ స్కూటర్‌ను అందుబాటులోకి ప్రవేశపెట్టనుంది. ఆ కంపెనీ ఏది?
- ఒలింపిక్స్ పోటీల్లో భారత్ తరఫున తొలి స్వర్ణపతకం అందించిన అథ్లెట్ నీరజ్ చోప్రా ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. ఓ టెన్నిస్ క్రీడాకారిణిని పెళ్లాడాడు. ఆమె ఎవరు?
- అట్లాంటిక్ మహా సముద్రంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో (మెక్సికో సిధుశాఖ) ప్రసిద్ధ భౌగోళిక ప్రదేశం. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ దీని పేరు మార్చేశారు. ఏమని పెట్టారు?
- కర్ణాటకలోని మంగళూరులో జనవరి 11 నుంచి 13 వరకు మొదటి దక్షిణాసియా మాస్టర్ అథ్లెటిక్ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. వీటిలో కాంస్య పతకం గెలుచుకున్న సిరిసిల్లకు చెందిన 70 ఏండ్ల మహిళ ఎవరు?
- 2024 డిసెంబర్ 3న దక్షిణ కొరియాలో ఆ దేశ అధ్యక్షుడు సైనిక పాలన విధించాడు. దీంతో అక్కడి పార్లమెంట్ ‘నేషనల్ అసెంబ్లీ’ ఆయనపై అభిశంసన తీర్మానం ఆమోదించింది. ఆ తర్వాత సైనిక పాలన కేసులో విచారణ కోసం ఆయనను అరెస్టు చేశారు. ఆయన ఎవరు?
- పన్నెండు ఏండ్లకు ఓసారి వచ్చే ప్రయాగరాజ్ కుంభమేళా ఎన్నో అద్భుతమైన విషయాల కలయిక. నాగా సాధువులు, సన్యాసులు, మామూలు భక్తులతో మేళా కళకళలాడిపోతుంది. ఈసారి పూసలు అమ్ముకునే కుటుంబానికి చెందిన ఓ యువతి వార్తల్లో సంచలనంగా నిలిచిపోయింది. ఆమె పేరేంటి?
- బ్రిటన్‌లోని డెర్బీ షైర్ నుంచి స్కాట్లాండ్ వరకు 430 కిలోమీటర్ల మోంటేన్ వింటర్ స్పైన్ రేస్ మహిళల విభాగంలో 44 ఏండ్ల మహిళ ఒకరు విజేతగా నిలిచారు. మంచు తుఫానులు, గడ్డ కట్టే చలి మధ్య 150 మందిని దాటుకుని విజయం సాధించిన ఆ అథ్లెట్ ఎవరు?
- ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గర కుంభమేళా సంరంభం గొప్పగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో 21 నియమాలు ఉన్న ఓ వ్రతం ఆచరిస్తున్నట్టుగా యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పొవెల్ వార్తల్లో నిలిచారు. ఆ వ్రతం ఏది?
- ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన ఓ పెంపుడు ఏనుగు భారత్‌లో ప్రవేశించింది. ఈ ఏనుగు తమదంటే తమదని బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమంది వాదించడంతో వివాదం కోర్టుకు చేరింది. ఈ ఏనుగు పేరేంటి?

జవాబులు
1. మౌంట్ ఇబు
2. టీవీఎస్ (జుపీటర్ మాడల్)
3. హిమాని మోర్
4. గల్ఫ్ ఆఫ్ అమెరికా
5. రామానుజమ్మ
6. యూన్ సుక్ యోల్ (అరెస్టయిన దక్షిణ కొరియా తొలి అధ్యక్షుడు కూడా ఈయనే)
7. మోనాలిసా భోస్లే (మధ్యప్రదేశ్)
8. లూసీ గోసేజ్
9. కల్పవాస్ వ్రతం
10. చంద్రతార
Read Today's Latest Current-affairs News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

