మెట్రో స్టేషన్లో మహిళకు లైంగిక వేధింపులు… సీసీటీవీలో రికార్డు
న్యూఢిల్లీ: మెట్రో స్టేషన్లో కూర్చొన్న మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. తన ప్రైవేట్ భాగాన్ని చూపించి అభస్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. జూన్ 2న ఒక మహిళ మెట్రో రైలులో ప్రయాణించింది. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక అడ్రస్ గురించి అడిగాడు. ఆ అడ్రస్ గురించి చెప్పిన ఆమె జోర్ భాగ్ మెట్రో స్టేషన్లో దిగింది. ఫ్లాట్‌ఫామ్‌పై ఒక చోట కూర్చొని క్యాబ్ బుక్ చేస్తున్నది.
కాగా, ఆ వ్యక్తి కూడా అదే స్టేషన్లో దిగాడు. మెట్రో స్టేషన్లో కూర్చొన్న ఆమె వద్దకు వచ్చి అడ్రస్ గురించి మళ్లీ అడిగాడు. ఆమె దాని గురించి చెబుతుండగా తన ప్రైవేట్ భాగాన్ని ప్రదర్శించాడు. దీంతో అతడి లైంగిక వేధింపులకు భయపడిన ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఈ ఘటనపై వరుస ట్వీట్లు చేసింది. సమీపంలో ఉన్న పోలీస్ సహాయం కోరినా పట్టించుకోలేదని ఆరోపించింది.
మరోవైపు మహిళ ట్వీట్లపై స్పందించిన ఢిల్లీ పోలీసులు ఆ మెట్రో స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దాని ఆధారంగా నిందితుడ్ని గుర్తించి తాజాగా అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman Molested Inside Delhi Metro Station, Horrific Act Caught on CCTV#DelhiMetro #JorBagh pic.twitter.com/iHKP2nMWwl
— TIMES NOW (@TimesNow) July 6, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
కమ్యూనిటీల్లో నీటి కటకట
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

