Vikarabad : పూల కోసం వెళ్లిన వ్యక్తి మృత్యు ఒడిలోకి..

దోమ : తామర పువ్వులు తెంపేందుకు నీటి కుంటలోకి వెళ్లిన వ్యక్తి మృత్యువాతపడ్డ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్‌లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల కేంద్రంలో పువ్వులు, పండ్ల వ్యాపారం చేసే వెంకట్రాములు, బాలమ్మ దంపతులు. వినాయక చవితి పండగ వస్తుండటంతో తామర పువ్వుల తెంపి అమ్ముకునేందుకు దండెంకుంటలోని వాటిని తెంపేందుకు దిగాడు. ఎంత సేపటికీ నీటిలో నుంచి బయటకు రాకపోవడం తో అతని భార్య బాలమ్మ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు విషయం ఆరా తీసి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో నాచులో చుట్టుకుపోయిన వెంకట్రాములు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ గ్రామానికి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. మృతుడి భార్య బాలమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై రమేశ్ కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime
- Crime news
- doma mandal
- lakes
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

